Secondary Infertility : నేటి తరం జంటలను కలవరపెడుతున్నసెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ..!

సాక్షి లైఫ్ : దేశంలో సంతానలేమి (Infertility) సమస్య పెరుగుతున్న నేపథ్యంలో, 'సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ' (Secondary Infertility) కేసులు పెరగడం వైద్య నిపుణులను కలవరపరుస్తోంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత, మళ్లీ గర్భం దాల్చడానికి లేదా ప్రెగ్నెన్సీని నిలబెట్టుకోడాన్ని"సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ" అంటారు. ఇంతకు ముందు సహజంగానే గర్భం దాల్చినప్పటికీ, రెండోసారి ఈ సమస్య రావడంతో ఎంతోమంది ఆందోళనకు గురవుతున్నారు.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

 ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి..Colorectal Cancer : పెద్ద పేగులో క్యాన్సర్‌ ను.. ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

 

హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోని ఫెర్టిలిటీ కేంద్రాలకు వస్తున్న కేసుల్లో దాదాపు 30శాతం నుంచి 40శాతం వరకు సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీకి సంబంధించినవే ఉంటున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ సమస్య 25 నుంచి 40 ఏళ్ల లోపు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

ఎందుకు పెరుగుతోంది..? ప్రధాన కారణాలు ఇవే..!

సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ పెరగడానికి కేవలం స్త్రీలే కాదు, పురుషుల్లో వచ్చే మార్పులు, జీవనశైలి (Lifestyle) కారణాలు ప్రధాన కారణాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.

వయస్సు ప్రభావం (Age Factor)..  

నేటి తరంలో చాలా మంది కెరీర్, ఆర్థిక స్థిరత్వం కోసం మొదటి బిడ్డనే ఆలస్యంగా కంటున్నారు. దీంతో, రెండో బిడ్డ కోసం ప్రయత్నించేసరికి స్త్రీల వయస్సు 30 దాటి, 35 ఏళ్లకు చేరుకుంటోంది. 30 ఏళ్ల తర్వాత అండాల నాణ్యత (Egg Quality) వేగంగా తగ్గిపోతుంది, ఇది గర్భధారణ అవకాశాలను తగ్గిస్తుంది. పురుషుల్లోనూ శుక్రకణాల (Sperm) నాణ్యత వయసుతో పాటు తగ్గుతుంది.

జీవనశైలి మార్పులు (Lifestyle Changes).. 

ఊబకాయం (Obesity): మొదటి కాన్పు తర్వాత బరువు పెరగడం, శరీరంలో కొవ్వు పెరగడం హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇది అండం విడుదల (Ovulation)ను ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి (Stress) నిద్రలేమి.. పిల్లల పెంపకం, ఉద్యోగ బాధ్యతలతో పెరిగే ఒత్తిడి, నిద్రలేమి సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. చెడు అలవాట్లు.. ధూమపానం, అతిగా మద్యం సేవించడం వంటి అలవాట్లు కూడా శుక్రకణాల సంఖ్యను తగ్గిస్తాయి.

మొదటి కాన్పు తర్వాత అనారోగ్య సమస్యలు.. 

 మొదటి ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ సమస్యలు, పీసీఓఎస్ (PCOS), ఎండోమెట్రియోసిస్ (Endometriosis) లేదా గర్భాశయ సమస్యలు (Uterine Issues) వంటివి సైలెంట్‌గా ఏర్పడవచ్చు.

నివారణకు సరళమైన పరిష్కారాలు (Simple Changes)
ద్వితీయ వంధ్యత్వాన్ని అధిగమించడానికి లేదా నివారించడానికి వైద్యులు సూచిస్తున్న సాధారణ జీవనశైలి మార్పులు ఇవే.

ఆరోగ్యకరమైన బరువు (Maintain Healthy Weight): శరీర బరువును అదుపులో ఉంచుకోవడం అత్యంత ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం హార్మోన్లను నియంత్రిస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు తగ్గించండి.

ఒత్తిడికి చెక్ (Manage Stress): యోగా, ధ్యానం (Meditation), ప్రాణాయామం వంటివి పాటించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. తగినంత నిద్ర: రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోండి.

పరీక్షలు తప్పనిసరి..  

మొదటి బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు రెండో బిడ్డ కోసం ప్రయత్నించి విజయం సాధించలేకపోతే, ఆలస్యం చేయకుండా ఇద్దరు భాగస్వాములు సంతానోత్పత్తి నిపుణుడిని (Fertility Specialist) సంప్రదించాలి. అండాశయ నిల్వ (AMH) శుక్రకణాల విశ్లేషణ పరీక్షలు చేయించుకోవాలి. "మొదటిసారి తేలికగా గర్భం దాల్చారు కాబట్టి రెండోసారి కూడా అలాగే జరుగుతుందని భావించకుండా, వయస్సు పెరుగుతున్న కొద్దీ వచ్చే శారీరక మార్పులను గుర్తించి, సమయానికి వైద్య సహాయం తీసుకుంటే సెకండరీ ఇన్‌ఫెర్టిలిటీ నుంచి బయటపడవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..రక్తపోటు (Blood Pressure) కారణంగా గుండెపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health mental-problems infertility-problems mental-issues pregnancy-time pregnant-women healthy-habits mental-stress good-habits sperm-count infertility bad-habits secondary-infertility infertility-in-modern-couples second-pregnancy-issues difficulty-conceiving-second-child
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com