videos
Gut Health care : పేగుల ఆరోగ్యం సరిగ్గా లేకపోవడమే 90 శాతం రోగాలకు కారణం అంటారు కదా, ఇందులో నిజమెంత..?
సాక్షి లైఫ్ : చక్కెర, పంచదార, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ మన పేగుల ఆరోగ్యాన్ని ఎలా నెమ్మదిగా దెబ్బతీస్తాయి? "మన రోగనిరోధక శక్తిలో (Immunity) 70 శాతం మన పేగుల్లోనే ఉంటుంది" అంటారు కదా, ఇది నిజమేనా? సరైన మోతాదులో నీరు తాగకపోవడానికి, పేగుల పనితీరు మందగించడానికి ఉన్న సంబంధం ఏమిటి? మొక్కల ఆధారిత ఆహారం: మాంసాహారం కంటే కూరగాయలు, ఆకుకూరలు (Plant-based diet) ఎక్కువగా తినడం గట్ హెల్త్‌కి ఎలా సహాయపడుతుంది? అధిక ఒత్తిడి (Stress) ఫీలైనప్పుడు యాసిడ్ రిఫ్లక్స్, కడుపు ఉబ్బరం వంటి గట్ సమస్యలు ఎందుకు వస్తాయి? నిద్రలేమికి, మన జీర్ణవ్యవస్థ దెబ్బతినడానికి మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి? మనం సరైన డైట్ పాటిస్తున్నప్పుడు, మన పేగులు తిరిగి ఆరోగ్యంగా మారుతున్నాయని (Heal అవుతున్నాయని) గుర్తించడం ఎలా? త్వరగా వృద్ధాప్యం రావడం అనేది కేవలం మన జన్యువుల (Genetics) వల్లే జరుగుతుందా? లేదా మన జీవనశైలి పాత్ర ఎక్కువ ఉంటుందా? స్వీట్స్ (Sugar) ఎక్కువగా తినడం వల్ల ముఖంపై ముడతలు త్వరగా వస్తాయంటారు (Glycation ప్రక్రియ), ఇందులో నిజమెంత? ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల కణాల స్థాయిలో వృద్ధాప్యాన్ని (Cellular Aging) ఎలా ఆపవచ్చు?నిద్ర ప్రాముఖ్యత: సరిపడా నిద్ర లేకపోవడం వల్ల ముఖం ఎందుకు త్వరగా కళావిహీనంగా, ముసలిదానిలా మారుతుంది? సూర్య కిరణాల ప్రభావం: ఎండ (UV Rays) వల్ల చర్మం త్వరగా ముడతలు పడకుండా రోజువారీ జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?కోపం, ఆందోళన లాంటి ప్రతికూల భావోద్వేగాలు (Negative emotions) త్వరగా ముసలితనం రావడానికి కారణమవుతాయా?సప్లిమెంట్స్: యాంటీ-ఏజింగ్ కోసం మార్కెట్లో దొరికే విటమిన్ సి, రెటినోల్, హైలురోనిక్ యాసిడ్ వంటివి వాడటం సురక్షితమేనా? యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) వృద్ధాప్య ఛాయలను ఎలా అడ్డుకుంటాయి? ఇవి ఎక్కువగా ఏయే ఆహారాల్లో దొరుకుతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
