videos
Night Cough : రాత్రివేళ ఎక్కువయ్యే దగ్గుకు కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : పిల్లల్లో దగ్గు ఎక్కువగా ఉంటే వెంటనే నెబ్యులైజర్ చేయాలా? తరచూ నెబ్యులైజర్ వాడితే ఊపిరితిత్తులపై ఏవైనా ప్రతికూల ప్రభావాలు ఉంటాయా? ఆస్తమా, COPD, బ్రాంకైటిస్ ఉన్నవారికి నెబ్యులైజర్ ఎందుకు ఎక్కువగా సూచిస్తారు? ఇన్హేలర్, నెబ్యులైజర్‌లో మందు శరీరానికి చేరే విధానం ఎలా వేరు? ఇన్హేలర్ సరిగ్గా ఉపయోగించకపోతే మందు ప్రభావం తగ్గుతుందా? దగ్గు సిరప్‌లను ఎక్కువ రోజులు వాడితే దుష్ప్రభావాలు ఉంటాయా? యాంటీబయాటిక్స్ అవసరం లేని దగ్గుకు అవి వాడితే ఏమవుతుంది? దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే అది అత్యవసర పరిస్థితిగా భావించాలా? వీజింగ్, ఛాతీ బిగుసుకుపోవడం ఉంటే నెబ్యులైజర్ తప్పనిసరిగా అవసరమా? ఇంట్లో నెబ్యులైజర్ మెషిన్‌ను ఎలా శుభ్రపరచాలి? ఒకే నెబ్యులైజర్‌ను కుటుంబ సభ్యులంతా ఉపయోగించవచ్చా? నెబ్యులైజర్ మాస్క్‌ను ఎంత తరచుగా మార్చాలి? పిల్లలకు మాస్క్‌తో చేయాలా? మౌత్‌పీస్‌తో చేయాలా? గర్భిణీలు, వృద్ధులు నెబ్యులైజర్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? దగ్గు తగ్గేందుకు మందులతో పాటు ఆవిరి, గోరువెచ్చని నీరు, తేనె వంటి ఇంటి చిట్కాలు ఎంతవరకు ఉపయోగపడతాయి? దగ్గు ఎన్ని రోజులకు మించి కొనసాగితే వెంటనే ఛెస్ట్ స్పెషలిస్ట్‌ను సంప్రదించాలి? సాధారణ దగ్గును నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలకు దారితీసే అవకాశముందా? సాధారణ జలుబు వల్ల వచ్చే దగ్గుకు నెబ్యులైజర్ పనిచేస్తుందా? వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అలెర్జీ వల్ల వచ్చే దగ్గును ఎలా గుర్తించాలి? దగ్గు సిరప్‌తో తగ్గే దగ్గు ఏది? ఇన్హేలర్ అవసరమయ్యే పరిస్థితులు ఏమిటి? నెబ్యులైజర్ వాడటం వల్ల దగ్గు వెంటనే తగ్గిపోతుందా? లేక అది కేవలం శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుందా? డాక్టర్ సూచన లేకుండా మెడిసిన్ వేసుకుని నెబ్యులైజర్ చేయడం ఎంత ప్రమాదకరం? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలను ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
