videos
Online Health Checkups : ఆన్‌లైన్ హెల్త్ చెకప్స్ గురించి వైద్యనిపుణులు ఏమంటున్నారు..?
సాక్షి లైఫ్ : AI లేదా యాప్ ఇచ్చే ఆరోగ్య సూచనలను ఎంతవరకు నమ్మాలి? ఆన్‌లైన్ హెల్త్ చెకప్ చేసుకునే ముందు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తమ వ్యక్తిగత ఆరోగ్య సమాచారం (Health Data) భద్రతకు ఎలాంటి చర్యలు అవసరం? ఏ వెబ్‌సైట్లు లేదా యాప్‌లు విశ్వసనీయమైనవో ఎలా గుర్తించాలి? భవిష్యత్తులో ఆన్‌లైన్ హెల్త్ చెకప్‌లు సంప్రదాయ హాస్పిటల్ చెకప్‌లకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందా? ఆన్‌లైన్ ఐ చెకప్స్ ను ఎంతవరకూ నమ్మవచ్చు..? వైద్యనిపుణులు ఏమంటున్నారు..? ఆరోగ్య నిపుణుల సలహా లేకుండా డిజిటల్ రిపోర్ట్‌ల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి? ఇటీవల ఆన్‌లైన్ హెల్త్ చెకప్‌లు, AI హెల్త్ అసెస్‌మెంట్ టూల్స్ విపరీతంగా పెరిగాయి. ఇవి నిజంగా ఎంతవరకు నమ్మద గినవి? కేవలం లక్షణాలు నమోదు చేస్తే వ్యాధిని గుర్తించ గలవా? ఆన్‌లైన్ రిపోర్ట్ ఆధారంగా మందులు వాడటం ఎంత ప్రమాదకరం? ప్రతి ఆరోగ్య సమస్యకు డిజిటల్ చెకప్ సరిపోతుందా? ఆన్‌లైన్ హెల్త్ చెకప్‌లో ఎలాంటి పరీక్షలు కచ్చితంగా చేయించు కోవచ్చు? ఎలాంటి పరిస్థితుల్లో మాత్రం ప్రత్యక్షంగా డాక్టర్‌ను కలవాల్సిందే? ఇంట్లోనే సేకరించే బ్లడ్ శాంపిల్స్, హోమ్ డయాగ్నస్టిక్ కిట్లు ఎంతవరకు ఖచ్చితమైన ఫలితాలు ఇస్తాయి? అనే అంశాలను గురించి ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డా. శ్రీలక్ష్మి నిమ్మగడ్డ సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
