బరువు తగ్గించే ఏబీసీ జ్యూస్..ఇదిగో..!
సాక్షి లైఫ్ : అధిక బరువు సమస్య..పెద్దలతోపాటు చిన్నారులను సైతం ఎంతో ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. ఈ మధ్యకాలంలో బరువు పెరగడం అనేది అతిపెద్ద సమస్యగా మారింది. కొన్నిరకాల జాగ్రత్తలు పాటిస్తే బరువు తగ్గడం పెద్ద సమస్య ఏమీ కాదు.కాకపోతే బరువు తగ్గాలనుకునేవారు కొద్దిపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుంది. అందులోభాగంగా ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామంచేయాలి. తీసుకునే ఆహారంలో నియమ, నిబంధనలు పాటించాలి. ఇలా చేస్తే పెద్దలైనా, చిన్నవారైనా సులభంగా ఊబకాయ సమస్య నుంచి బయటపడొచ్చు.
అయితే బరువు తగ్గడంకోసం బాగా పనితీరు చూపించే వాటిలో ఇటీవల కాలంలో ఏబీసీ జ్యూస్ వచ్చి చేరింది. అధిక బరువు సమస్యకు ఇది సరైన పరిష్కారం అంటూ సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తోంది. నిజంగా ఏబీసీ జ్యూస్ తో బరువు తగ్గొచ్చా..?అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అసలు ఏంటి ఏబీసీ జ్యూస్..?
ఏబీసీ జ్యూస్ అనేది మూడు రకాల పండ్ల రసాల మిశ్రమం. ఇందులో ఏ అంటే యాపిల్,బీ అంటే బీట్‌రూట్, సీ అంటే క్యారెట్. ఈ మూడింటినీ కలిపి ఏబీసీ జ్యూస్ గా పిలుస్తున్నారు.
యాపిల్ జ్యూస్..
ఈ జ్యూస్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ , క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషించే ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు వీటిలో ఎక్కువగా ఉన్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
బీట్‌రూట్ జ్యూస్..
శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించే లక్షణాలు బీట్ రూట్ లో ఉన్నాయి. యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నివారణలో బాగా ఉపయోడపడుతాయి. నైట్రేట్ కంటెంట్ ఎక్కువ. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, నొప్పిని తగ్గించడానికి, జీవక్రియనుమెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
క్యారెట్ జ్యూస్..
క్యారెట్‌లో బీటా-కెరోటిన్ విటమిన్ "ఏ" ఎక్కువగా లభిస్తుంది. అంతేకాదు కెరోటినాయిడ్స్, విటమిన్లు , డైటరీ ఫైబర్ కంటెంట్ కు క్యారెట్ మూలం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరంలో ఉండే విషాన్ని తొలగిస్తాయి.
ఇది కూడా చదవండి.. క్యాన్సర్ రకాలు..వాటి ప్రభావం..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
