రోగనిరోధక శక్తి కోసం ఎలాంటి అల్పాహారం తీసుకోవాలి..? 

సాక్షి లైఫ్ : డెంగ్యూ జ్వరం, ర్యాట్ ఫీవర్ వంటి వ్యాధులు సోకినట్లయితే, అది శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అంతేకాదు వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందువల్ల, రోగనిరోధక శక్తిని పెంచే ముఖ్యమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం చాలా అవసరం. రోగనిరోధక శక్తి అనేది వివిధ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది. అల్పాహారంలో హెల్తీ ఫుడ్స్‌ని చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి అల్పాహారంలో ఎలాంటి ఆహారాలు చేర్చుకోవాలంటే..? 

ఇది కూడా చదవండి.. 30 ఏళ్ల తర్వాత శరీరానికి కొల్లాజెన్ ఎందుకు ముఖ్యమంటే..?

గుడ్డు.. 

రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లలో విటమిన్ డి, జింక్, సెలీనియం, విటమిన్ "ఇ" వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరానికి సరైన రోగనిరోధక పనితీరుకు అవసరం. అల్పాహారంలో ప్రతి రోజు ఉడికించిన గుడ్లు లేదా ఆమ్లెట్ తీసుకోవచ్చు.

చిలగడదుంప.. 

చిలగడదుంప శరీర శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, థయామిన్, జింక్, విటమిన్లు ,మినరల్స్ వంటి పోషకాలు వీటిలో ఉంటాయి. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు తక్కువగానూ ఉండటం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది.

ఓట్స్.. 

ఓట్ మీల్ ఆరోగ్యకరమైన అల్పాహారం. ఓట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఓట్స్‌లో ఫైబర్, బీటా-గ్లూకాన్ కూడా ఉంటాయి.

ఇది కూడా చదవండి..సడెన్ గా డైట్ చేంజ్ చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health mental-health healthy-food super-food immune-system food-immune-system best-food adult-immunity herd-immunity autoimmune-diseases immunity

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com