Common Oral Problems : వంటింట్లో ‘లవంగం’ ఔషధం.. నోటి సమస్యలకు సరైన పరిష్కారం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వంటింట్లో ఘుమఘుమలు పంచే దినుసుల్లో లవంగానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం వంటకాల రుచిని పెంచడానికే కాకుండా, శతాబ్దాలుగా సాంప్రదాయ ఆయుర్వేదంలో అద్భుత ఔషధంగా సేవలందిస్తోంది. ముఖ్యంగా దంత సమస్యలు, నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి లవంగం ఓ సహజ ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేక రసాయన సమ్మేళనాలు నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడతాయో, దీనిని వినియోగించే విధానం ఏమిటో చూద్దాం..!

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?

 

లవంగంలో దాగున్న అసలైన బలం.. ‘యూజెనాల్’..

లవంగానికి ఉండే ఘాటైన వాసన, రుచి వెనుక యూజెనాల్ (Eugenol) అనే సహజసిద్ధమైన సమ్మేళనం ఉంది. దీనిలో సహజ మత్తు గుణం..యాంటీ ఇన్‌ఫ్లమేటరీ అండ్ అనల్జెసిక్. యాంటీ మైక్రోబియల్...హానికర బ్యాక్టీరియాను నిరోధించే శక్తి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మెండుగా ఉన్నాయి. దంత వైద్యంలోనూ తాత్కాలిక నొప్పి నివారణకు యూజెనాల్‌ను వినియోగిస్తారు.

నోటి సమస్యలకు లవంగం అందించే ప్రయోజనాలు..

1. దంతాల నొప్పికి తాత్కాలిక ఊరట..

పంటినొప్పి లేదా చిగుళ్ల మంట ఉన్నప్పుడు నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగాన్ని ఉంచి నొక్కిపట్టినా, లేదా దూదిని కొద్దిగా లవంగ నూనెలో ముంచి అక్కడ ఉంచినా నొప్పి తగ్గుముఖం పడుతుంది. అయితే ఇది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. పుప్పిపన్ను (cavity), ఇన్ఫెక్షన్ ఉంటే వైద్యుడిని సంప్రదించి మూలకారణాన్ని సరిచేసుకోవాలి.

2. నోటి దుర్వాసనకు చెక్..

లవంగానికి ఉండే సహజ సువాసన నోటిలోని బ్యాక్టీరియాను అణచివేసి దుర్వాసనను దూరం చేస్తుంది. భోజనం తర్వాత ఒక లవంగాన్ని బుగ్గన పెట్టుకుని నెమ్మదిగా రసాన్ని మింగడం వల్ల శ్వాసలో తాజాదనం వస్తుంది.

3. చిగుళ్ల సంరక్షణ..

చిగుళ్ల వాపు లేదా స్వల్ప రక్తస్రావం ఉన్నప్పుడు లవంగంలోని యూజెనాల్ ఉపశమనాన్ని ఇస్తుంది. లవంగాల కషాయంతో నోటిని పుక్కిలించడం వల్ల చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

4. నోటిలో సూక్ష్మజీవుల నియంత్రణ..

నోటి లోపల తిష్టవేసే హానికర బ్యాక్టీరియా కాలక్రమేణా గార (plaque) కట్టడానికి దారితీస్తుంది. లవంగంలో ఉండే యాంటీ-మైక్రోబియల్ గుణాలు ఈ బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకోవడంలో సహాయపడతాయి.

వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలు..

నూనెను నేరుగా వాడకూడదు..లవంగం నూనె (Clove oil) చాలా గాఢంగా ఉంటుంది. దీనిని నేరుగా చిగుళ్లపై లేదా నోటి చర్మంపై రాస్తే మంట, చర్మం కమిలిపోయే ప్రమాదం ఉంది. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కలిపి మాత్రమే దూదితో రాయాలి.

పిల్లలకు తగిన జాగ్రత్త.. చిన్న పిల్లలకు లవంగ నూనెను నేరుగా అస్సలు ఉపయోగించకూడదు. వైద్యుల పర్యవేక్షణ ముఖ్యం.. దంతాల నొప్పి, చిగుళ్ల నుంచి రక్తస్రావం లేదా తీవ్రమైన దుర్వాసన చాలా రోజులుగా వేధిస్తుంటే కేవలం ఇంటి చిట్కాలకే పరిమితం కాకుండా డెంటిస్ట్‌ను సంప్రదించి పరీక్ష చేయించుకోవాలి. లవంగం అనేది నోటిని తాజాగా ఉంచేందుకు, ఆకస్మిక నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇంట్లో లభించే అత్యుత్తమ ప్రథమ చికిత్స సాధనమే గానీ, దంత సమస్యలకు శాశ్వత వైద్య చికిత్స కాదని గుర్తుంచుకోవాలి.

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.