ఆల్మండ్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..  

షేర్ చేయండి:
ఆల్మండ్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..  

సాక్షి లైఫ్ : ఏదైనా మితిమీరి తింటే ఆరోగ్యానికి హానికరం. ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల హాని కలుగుతుంది. ప్రతిదానికీ రెండు కోణాలు ఉంటాయి. ఏదైనా ఒక దానితో ప్రయోజనం ఉంటే, దానిలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. బాదంపప్పు కూడా ఇలాంటిదే.డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి  తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

గుండె, మెదడుకు మేలు చేసే వాటిలో బాదం కూడా ఒకటి. అయితే బాదంలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యందెబ్బతింటుంది. అవును అవసరమైన దానికంటే ఎక్కువగా బాదంపప్పులు తింటే.. కొన్ని దుష్ప్రభావాలున్నాయి.. అవేంటంటే..?  పరిమిత పరిమాణంలో బాదంలు తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.  కానీ అధికంగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి. బాదంపప్పులను ఎక్కువగా తినడం వల్ల కలిగే కొన్ని నష్టాలను గురించి  తెలుసుకుందాం.. 

కిడ్నీ స్టోన్స్.. 

బాదంపప్పును ఎక్కువగా తినడం వల్ల ఆక్సలేట్ స్థాయి పెరుగుతుంది. బాదంపప్పులో ఆక్సలేట్ ఉంటుంది. ఇది కిడ్నీలో పేరుకుపోయి కిడ్నీలో రాళ్లను కలిగిస్తుంది. కాబట్టి, బాదంపప్పును పరిమిత పరిమాణంలో తీసుకోవడం మంచిది.

ఓవర్ వెయిట్.. 
 
ఎక్కువగా బాదంపప్పు తినడం వల్ల కూడా బరువు పెరుగుతుంది. ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ మోతాదులో తినడం వల్ల బరువు పెరుగుతారు.

పోషకాల లోపం.. 

బాదంపప్పులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇతర ముఖ్యమైన ఖనిజాలు, పోషకాలను శరీరం గ్రహించేటప్పుడు ఆటంకం కలిగిస్తుంది. ఈకారణంగా శరీరంలో కాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాల లోపం ఏర్పడుతుంది.

జీర్ణ సమస్యలు.. 

బాదంపప్పును ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇందులో ఉండే అధిక పీచు పదార్థం ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

అలర్జీలు.. 


అపరిమితంగా బాదంపప్పు తింటే అలెర్జీ సమస్యలు వస్తాయి. దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటుకు బాదంపప్పు కారణమవుతుంది.

ఇది కూడా చదవండి..  బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.