బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?
సాక్షి లైఫ్ : ఒక్కో పండు తినడం వల్ల ఒక్కోసారి కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని సార్లు నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు గర్భిణీగా ఉన్న సమయంలో కొన్నిరకాల పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. బొప్పాయి పండు తినడం వల్ల గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గర్భధారణ సమయంలో బొప్పాయి పండు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చొ తెలుసుకుందాం..
బొప్పాయిలో పోషకాలు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి తల్లి, బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. బొప్పాయి సాధారణంగా వికారం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.
పాల ఉత్పత్తిలో బొప్పాయి కీలక పాత్ర పోషిస్తుంది. తల్లి వద్ద బిడ్డకు తగినన్ని పాలు లేనప్పుడు పాలు పెరగడానికి బొప్పాయి తినమని పెద్దవాళ్లు చెబుతుంటారు. ఇలాంటి సమయంలో బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది.
చాలా మంది బాలింతలు మలబద్ధకం, గుండెల్లో మంటతో బాధపడుతుంటారు. అలాంటి వారికి బొప్పాయి మంచిఉపశమనం కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. బొప్పాయిలో పొటాషియం, బీటా-కెరోటిన్ , విటమిన్లు ఏ, బి, సి పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ శిశువుల నరాల అభివృద్ధికి దోహదం చేస్తాయి.
గర్భధారణ సమయంలో తల్లికి వైరల్ ఫీవర్ కారణంగా ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతే బొప్పాయి తీసుకోవడం వల్ల సాధారణ స్థాయికి వచ్చే అవకాశం ఉంటుందని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
