ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసా..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్: శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచడానికి, ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ,పోషకమైన పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అనేక రకాల సీజనల్ పండ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతోపాటు పలు వ్యాధుల నుంచి రక్షించడంలో మేలు చేస్తుంది. అయితే మనం రోజూ ఏమి తినాలి అనే దానికంటే, ప్రస్తుత సమయంలో ఏయే వాటికి దూరంగా ఉండాలో కూడా తెలుసుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి.. కిడ్నీలకు హాని కలిగించే ఫుడ్..    

చక్కెర, ఉప్పు..

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే చక్కెర, ఉప్పు రెండింటినీ తగ్గించాలని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఉప్పు అధికంగా తీసుకోవడం అనేక విధాలుగా ఆరోగ్యానికి హాని జరుగుతుంది. దీని కారణంగా, రక్తపోటు పెరగడంతోపాటు గుండెకు హానికలిగిస్తుంది. అంతేకాదు, ఉప్పు ఎముకలకు కూడా హానికరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 కాల్షియం లోపం..  

ఎముకలను ఆరోగ్యంగా , దృఢంగా ఉంచడానికి అత్యంత అవసరమైన పోషకాలలో కాల్షియం ఒకటి. ఎక్కువగా ఉప్పు తీసుకుంటే, అది శరీరంలో కాల్షియం లోపానికి కారణమవుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎంత ఎక్కువ ఉప్పు తింటే, మీ శరీరం నుంచి అంత  ఎక్కువ కాల్షియం పోతుందట, అంటే ఇది మీ ఎముకలకు కూడా చాలా హానికరం.

రక్తప్రవాహంలో సోడియం స్థాయిలు పెరగడం వల్ల మూత్రపిండాలు వ్యర్థాలను బయటకు పంపే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఇది శరీరంలోని  రక్తనాళాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. అధిక రక్తపోటు చివరికి హార్ట్ స్ట్రోక్ ,హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.  

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల 

సోడియం లేదా ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా హాని కలుగుతుంది. ఇది కండరాలు, ఎముకలతోపాటు అనేక ఇతర అవయవాలపై తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుంది.

గుండె కండరాల సమస్య
తలనొప్పి - మూత్రపిండ వ్యాధి
బోలు ఎముకల వ్యాధి
గుండె కొట్టుకోవడం సమస్య.
అధిక రక్త పోటు
మూత్రపిండాల్లో రాళ్లు.
కడుపు క్యాన్సర్ ప్రమాదం.

ఇది కూడా చదవండి.. రక్తపోటును అదుపులో ఉంచే టీ గురించి తెలుసా..?

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.