నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? 

షేర్ చేయండి:
నిత్యం యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా..? 

సాక్షి లైఫ్: అందంగా కనిపించాలని కోరుకోని వారెవరూ ఉండరు. కానీ కొంత వయస్సు వచ్చాక వృద్ధాప్య సంకేతాలు మీ అందాన్ని తగ్గిస్తాయి. అటువంటి సమయంలోనే ప్రజలు ఎక్కువ కాలం యవ్వనంగా ఉండటానికి అనేక సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. అయితే, ఈ ఉత్పత్తులు చర్మానికి హాని కలిగిస్తాయి. సహజంగా మీరు కొన్ని యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా యవ్వనంగా ఉండొచ్చు.


 ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు.. 

స్కిన్ కేర్ టిప్స్..  


ప్రతి వ్యక్తి ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటాడు. అందుకోసం బ్యూటీపార్లర్లలో అనేక రకాల ట్రీట్ మెంట్లు తీసుకుంటుంటారు. అంతేకాదు మరికొంత మంది స్కిన్ కేర్ టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇవేమీ కాకుండా మీరు మీ వయస్సు కంటే యవ్వనంగా కనిపించాలనుకుంటే, మీరు మీ ఆహారంలో కొన్ని రకాల ఆహారాలను చేర్చుకోవడం ద్వారా యంగ్ గా కనిపించవచ్చు.  

 నేటి జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు తమ వయస్సు కంటే ముందే వృద్ధాప్యంగా కనిపిస్తున్నారు. 35-40 సంవత్సరాల వయస్సులోనే ముఖంపై మచ్చలు, ముడతలు వస్తున్నాయి. కాబట్టి మీ ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవడం ద్వారా యవ్వనంగా ఉండొచ్చు. 

చేప..  

 కొవ్వుతో కూడిన చేపలు చర్మంపై వృద్ధాప్య సంకేతాలను నివారించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇలాంటి చేపలను తినడం వల్ల మీ చర్మం ముడతలు రాకుండా ఉంటుంది.


గ్రీన్ టీ..  

గ్రీన్ టీ తాగడం వల్ల బరువు అదుపులో ఉండడమేకాకుండా చర్మాన్ని కూడా మృదువుగా ఉంచుతుంది. గ్రీన్ టీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే పాలీఫెనాల్స్, ముఖ్యంగా కాటెచిన్స్, యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

బెర్రీస్..  
 
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ వంటి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండే బెర్రీస్ ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మంలో వయసు సంబంధిత మార్పులను నెమ్మదింపజేసి, మీరు యవ్వనంగా ఉండేలా చేస్తాయి. 

 చర్మం ఆరోగ్యం..

బాదం, వాల్‌నట్‌లు, గుమ్మడికాయ గింజలు మొదలైన వాటిని చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి.. బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచే కాయ..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.