బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచే కాయ..  

షేర్ చేయండి:
బ్లడ్ షుగర్ ను అదుపులో ఉంచే కాయ..  

సాక్షి లైఫ్:మధుమేహ సమస్య ఉన్నవారు ఆహారంతో పాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. అందుకోసం ఆహారంలో తమకు అవసరమైన వాటిని చేర్చుకోవాలి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. అంతేకాదు దీనిని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ నార్మల్ లెవల్లో ఉంటాయి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ చక్కెర స్థాయిలను వేగంగా నియంత్రిస్తుంది. ఇంతకీ ఏంటా కాయ అంటే..?

బెండకాయ, దీనినే లేడీఫింగర్ అనికూడా అంటారు. ఈ కాయను ఇష్టపడని వారు ఉండరు. కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే బెండకాయ రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా నియంత్రిస్తుంది. బెండకాయలో కేలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. 

పచ్చి కూరగాయలు..

 కూరగాయలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పచ్చి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. దీని వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చనివారు వెల్లడిస్తున్నారు. బెండకాయ తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది మధుమేహ రోగులకు ఔషధం. పొటాషియం, విటమిన్ సి, కాల్షియం తోపాటు అనేక పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇది అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. బెండకాయ తినడం ద్వారా మధుమేహం వంటి తీవ్రమైన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..  

 ఇది కూడా చదవండి.. హెల్తీ లైఫ్ కావాలంటే ఇవి తప్పనిసరి.. 


ఫైబర్ కంటెంట్..   

బెండకాయలో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించి, జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఈ కూరగాయ అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. డయాబెటిక్ సమస్య ఉన్నవారు తమ ఆహారంలో బెండకాయను చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 


యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం.. చాలా మందికి ఇష్టమైన కూరగాయ బెండకాయ. ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి. అయితే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి.

తక్కువ కేలరీలు..  

బెండకాయలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. బరువును తగ్గించాలనుకుంటే ఈ బెండకాయ తీసుకోవడం చాలా మంచిది. తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడొచ్చు.  

 లేడీస్ ఫింగర్ వాటర్ తాగడం వల్ల.. 

డయాబెటిక్ పేషెంట్లు బెండ కాయలు తినవచ్చు, కానీ వీటితో కూర చేసేటప్పుడు ఎక్కువ నూనె, మసాలాలు వాడకూడదు. డయాబెటిస్ రోగులకు లేడీస్ ఫింగర్ వాటర్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నీళ్లు తాగడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.

బెండకాయ నీళ్లు ఎలా తయారుచేసుకోవాలి..?  

బెండకాయ నీటిని తయారు చేయడానికి, మొదట బెండకాయలను కడగాలి. ఆ తర్వాత రాత్రంతా నీటిలో నానబెట్టి. ఈ నీటిని ఉదయాన్నే వడపోసి ఖాళీ కడుపుతో తాగాలి.

ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.