బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు.. 

షేర్ చేయండి:
బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు.. 

సాక్షి లైఫ్ : మనం తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ ఆరోగ్యానికి మంచివే అయినా , కొన్ని ఆహారాలను కలిపి తినడం వల్ల శరీర జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని అంటున్నారు వైద్యనిపుణులు. కొన్నిసార్లు, కొన్నిరకాల ఆహారపదార్థాలు త్వరగా జీర్ణమైతే, మరికొన్ని ఆహారపదార్థాలు జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ పరిస్ధితి జీర్ణ సంబంధిత సమస్యలు, వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇలాంటి పరిస్థితులు నివారించడానికి కొన్ని ఆహారాలను కలిపి తినకూడదు. అవేంటంటే..?  

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

అవకాడోలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి, మెదడు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి అవకాడోలు ఎంతో మేలు చేస్తాయి. అయితే అవకాడోతో  కొన్నిరకాల ఆహారపదార్థాలు తినకూడదట.  

 

 ప్రాసెస్ చేసిన ఆహారాలు..

అవకాడోలు ఆరోగ్యకరమైన కొవ్వులు. ప్రాసెస్ చేసిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి రెండూ కలిపి తీసుకోవడం కూడా శరీరానికి మంచిది కాదు. అవకాడోతో కొవ్వు పదార్థాలు తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

 పాల ఉత్పత్తులు.. 

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. జున్ను లేదా పాలు, ఇతర పాల ఉత్పత్తులు కూడా కొవ్వు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రెండూ కలిస్తే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

 పుల్లని పండ్లు.. 

అవోకాడోతో పాటు నారింజ,ద్రాక్ష వంటి పుల్లని పండ్లను తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

తీపి పదార్థాలు.. 

అవకాడోలో చక్కెర తక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కెర అధికంగా ఉండే ఆహారపదార్థాలు అవకాడోతో కలిపి తినకూడదు.

 ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు..

ప్రొటీన్ ఫుడ్స్‌లోని కొవ్వు, అవకాడోలోని కొవ్వుతో కలిపి తీసుకుంటే  శరీరంలోని అధిక కొవ్వుకు దారి తీస్తుంది. కాబట్టి అవకాడోతో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. 

  ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు..

అవకాడోలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సాల్టీ ఫుడ్స్‌లోని సోడియం వీటితో కలిపి తింటే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది అంతేకాదు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.