బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
సాక్షి లైఫ్ : బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గమనించినట్లయితే, మీ మనస్సు సందేహం ఉంటే, ఆలస్యం చేయకుండా బ్లడ్ క్యాన్సర్ నిర్ధారణ కోసం వైద్యుడిని సంప్రదించాలి. అప్పుడు డాక్టర్ మీకు కొన్ని పరీక్షలు, బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోసిస్ టెస్ట్ చేయించుకోమని సలహా ఇస్తారు. అటువంటివాటిలో కొన్ని ప్రధానమైన పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
కంప్లీట్ బ్లడ్ కౌంట్ (సిబిసి)..
బ్లడ్ క్యాన్సర్ అని అనుమానం ఉన్నట్లయితే ఖచ్చితంగా చేసే మొదటి పరీక్ష ఇది. సిబిసి టెస్టు ద్వారా రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్ల స్థాయిలు తెలుసుకోవచ్చు. వీటిలో ఏమైనా తేడా ఉంటే రక్త క్యాన్సర్ సంకేతాలు ఉన్నట్లు గుర్తిస్తారు.
ఎముక మజ్జ బయాప్సీ..
ఎముక మజ్జ బయాప్సీలో క్యాన్సర్ కణాల ఉనికిని తనిఖీ చేయడానికి సాధారణంగా తుంటి ఎముక నుంచి ఎముక మజ్జ చిన్న నమూనాను సేకరించడం జరుగుతుంది. లుకేమియా, లింఫోమా , మైలోమా నిర్ధారణకు ఈ పరీక్ష అవసరం.
ఫ్లో సైటోమెట్రీ..
ఈ పరీక్ష రక్తం లేదా ఎముక మజ్జ నమూనాలోని కణాల భౌతిక, రసాయన లక్షణాలను విశ్లేషిస్తుంది. ఇది క్యాన్సర్ కణాల ఉపరితలంపై నిర్దిష్ట గుర్తుల గుర్తింపు, రోగ నిర్ధారణ, వర్గీకరణలో సహాయపడుతుంది.
సైటోజెనెటిక్ పరీక్ష..
ఈ పరీక్షలో రక్త క్యాన్సర్ ఉనికిని సూచించే జన్యుపరమైన అసాధారణ లోపాలను గుర్తించడానికి రక్తం లేదా ఎముక మజ్జ కణాల క్రోమోజోమ్‌లను పరిశీలిస్తారు.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
