సాక్షి లైఫ్ : మీరు కూడా బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నారా..? మీకు ఫిట్ బాడీ కావాలా..? అయితే, కొరియన్ డైట్ మీకు సరైన పరిష్కారం. ఇతర డైట్లకు కొరియన్ డైట్ ఏంటి తేడా..? అసలు ఈ కొరియన్ డైట్ బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది..? కొరియన్ డైట్ అంటే ఏమిటి..? ఈ డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
బరువు తగ్గడంలో..
కొరియన్ ఆహారం బరువు తగ్గడంలో చాలా సహాయకారిగా ఉంటుంది.ఈ తరహా డైట్‌లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మీరుకూడా కొరియన్ల వలె స్లిమ్ గా ఉండాలంటే..? ఈ డైట్ ఖచ్చితంగా సరిపోతుంది. మీరు బరువు తగ్గడానికి అనేక డైట్ ప్లాన్‌లను ప్రయత్నించి ఉండవచ్చు, కానీ కొరియన్ డైట్ ఫాలో అవ్వడం ద్వారా వచ్చే ఫలితాలు చూస్తే ఆశ్చర్యపోతారు. కొరియన్ ప్రజలు అందంగా ఉండడమేకాకుండా, ఆరోగ్యకరమైన ఫిట్నెస్ కలిగిన శరీరాలకు ప్రసిద్ధి.
అయితే వారి రోజువారి ఆహారంలో ఎలాంటి పదార్థాలని తీసుకుంటారు..? ఎలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా అందంగా ఆరోగ్యంగా ఉండొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొరియన్ డైట్ లో వారి ఆహారంలో తాజా కూరగాయలు, సీఫుడ్ , పండ్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రకమైన ఆహారం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
కొరియన్ డైట్ అంటే ఏమిటి..?
కొరియన్ డైట్ అనేది సాంప్రదాయ కొరియన్ ఆహారపు అలవాట్ల ఆధారంగా బరువు తగ్గించే పద్ధతి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పలురకాల పండ్లు, సి ఫుడ్ వంటివి ఉంటాయి. ఈ ఆహారం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
వ్యాయామం..
కొరియన్ డైట్‌తో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. యోగా, నడక లేదా సైక్లింగ్ వంటి శారీరక కార్యకలాపాలు బరువును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ వ్యాయామాలు కేలరీలను బర్న్ చేయడమే కాకుండా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
రుచిగా తినాలనే కోరికలను నియంత్రించండి..
కొరియన్ డైట్ శరీర బరువును తగ్గించే సాంప్రదాయ కొరియన్ ఆహారపు అలవాట్ల ఆధారంగా రూపొందించిన ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం. ఈ ఆహారంలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ను నివారిస్తారు. ఎందుకంటే అవి బరువు పెరగడానికి ప్రధాన కారణం కాబట్టి.
ఇవి తగ్గించాలి..?
కొరియన్ డైట్ విషయంలో భాగంగా కొన్నిరకాల ఆహారాల నియంత్రణ చాలా ముఖ్యం. కొరియన్ డైట్ ఒకేసారి ఎక్కువగా తినరు. మీరు ఈ ఆహారాన్ని అనుసరించాలనుకుంటే, మీరు పాల ఉత్పత్తులు, చక్కెర వంటివి తీసుకోకూడదు. ఇవే కాకుండా ఆహారంలో పాలు, పెరుగు, చాక్లెట్, స్వీట్లను పూర్తిగా మానేయాలి.
గోధుమలు, చక్కెర..
మీరు కొరియన్ ప్రజల వలె ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే, మీరు మీ ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. గోధుమలు, చక్కెర, పాల ఉత్పత్తులతోపాటు అధిక కొవ్వు పదార్ధాల తీసుకోవడం తగ్గించాలి. వీటికి బదులుగా, కూరగాయలు, రైస్, చేపలను చేర్చుకోవాలి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com