సాక్షి లైఫ్ : టీ అనేది భారతీయులకు ఒక ఎనర్జీ డ్రింక్. పొద్దున్నే నిద్ర లేవాలన్నా, పనికి వెళ్లాలన్నా, అలసట పోగొట్టుకోవాలన్నా.. టీ తాగుతుంటారు.ఈ రోజు అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా సాక్షిలైఫ్ ప్రత్యేక కథనం. టీ చాలా రకాలు ఉన్నాయి. పాలు, పంచదార, టీ ఆకులతో తయారైన టీ ఇప్పుడు అనేక రకాలుగా తయారవుతోంది. కాశ్మీర్‌లోని కహ్వా టీ ను ఉదాహరణగా చూడవచ్చు. అలాంటి కొన్ని ప్రసిద్ధ టీ వెరైటీల గురించి తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
మసాలా టీ..
మసాలా టీలో అనేక రకాల మసాలాలు ఉపయోగిస్తారు. ఇవి టీ రుచిని పెంచడమే కాకుండా దీనిని తాగడంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చలికాలంలో ఈ టీ తాగడం వల్ల వెచ్చగా ఉంచుతుంది. లవంగం, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు ఈ టీ తయారీకోసం ఉపయోగిస్తారు.
ఇరానియన్ టీ..
భారతదేశంలో కూడా ఇరానియన్ టీని రుచి చూడవచ్చు. హైదరాబాద్, పూణేలలో ఈ టీకి ఆదరణ ఎక్కువగా ఉంటుంది.
బటర్ టీ..
బటర్ టీ అనేది హిమాలయ ప్రాంతాలలో ఒక వెరైటీ టీ. దీనిని వెన్న, టీ ఆకులు, ఉప్పుతో తయారు చేస్తారు. ఈ టీ రుచిలో అద్భుతంగా ఉంటుంది.
తందూరి టీ..
తందూరి టీ మహారాష్ట్రకు చెందిన ప్రత్యేక టీ ఇది.
నూన్ టీ..
కాశ్మీర్‌లో నూన్ టీ రుచి చూడవచ్చు. ఇది ఇక్కడి సాంప్రదాయ టీ. కాశ్మీర్‌తో పాటు రాజస్థాన్, నేపాల్‌లో కూడా నూన్ టీ ప్రసిద్ధి చెందింది.
ఐస్ టీ..
ఐస్ టీని వేసవిలో ఎక్కువగా ఇష్టపడతారు. మామూలు టీలాగా కాకుండా, ఐస్ తోపాటు టీ పొడి, చక్కెర,నిమ్మకాయలతో తయారు చేస్తారు.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com