World Lung Day 2026: కాలుష్యం, పొగ బారి నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోండిలా..!
సాక్షి లైఫ్ : నేటి కాలంలో పెరుగుతున్న వాయు కాలుష్యం, దుమ్ము, ధూళి, సిగరెట్ పొగ మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమించాయి. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న గాలిని పీల్చడం వల్ల తరచుగా దగ్గు, ఆయాసం, ఛాతీలో పట్టేసినట్లు ఉండటం వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారికి ఈ కాలుష్యం మరింత ప్రమాదకరం.
వాతావరణ కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టడం మన చేతుల్లో లేకపోయినా.. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సెప్టెంబర్ 25వతేదీన 'ప్రపంచ ఊపిరితిత్తుల దినోత్సవం' (World Lung Day) సందర్భంగా మన ఊపిరితిత్తులను పదిలంగా ఉంచుకునే సులభమైన మార్గాలను తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్..
ఇది కూడా చదవండి..మలప్పురంలోని పాండిక్కాడ్ నుంచి సేకరించిన గబ్బిలాల నమూనాల్లో నిఫా వైరస్ యాంటీబాడీస్..
ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు..
1. కాలుష్యం తీవ్రత ఉన్నప్పుడు బయటకు వెళ్లకండి..
గాలి నాణ్యత క్షీణించినప్పుడు, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఆరుబయట తిరగడం తగ్గించడం ఉత్తమం. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకండి. అలాగే, కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో ఆరుబయట చేసే వ్యాయామాలకు కాస్త విరామం ఇవ్వండి.
2. మాస్కు ధరించడం మర్చిపోవద్దు..
కాలుష్యం, దుమ్ము ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ముఖానికి సరిగ్గా సరిపోయే నాణ్యమైన మాస్కును ధరించడం అలవాటు చేసుకోండి. మాస్క్ అనేది ముక్కు, నోరు పూర్తిగా కవర్ చేసేలా ఉండాలి. దీనివల్ల గాలిలోని ప్రమాదకరమైన సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరకుండా అడ్డుకోవచ్చు.
3. ధూమపానానికి దూరంగా ఉండటం..
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల వల్ల వెలువడే పొగ ఊపిరితిత్తులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. మీరు ధూమపానం చేయకపోవడం ఎంత ముఖ్యమో, ఇతరులు కాల్చే పొగ పీల్చకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. పొగరాయుళ్లకు వీలైనంత దూరంగా ఉండండి.
4. ఇంటి వాతావరణం స్వచ్ఛంగా ఉంచుకోండి..
ఇంటి లోపల దుమ్ము, ధూళి చేరకుండా జాగ్రత్త పడాలి. వంట చేసేటప్పుడు పొగ బయటకు వెళ్లేలా తగినంత గాలి, వెలుతురు వచ్చేలా (వెంటిలేషన్) చూసుకోవాలి. ఇంట్లో ఎవరినీ ధూమపానం చేయనివ్వకండి. గాలి నాణ్యత బాగా లేనప్పుడు అవసరమైతే ఎయిర్ ప్యూరిఫైయర్లను వినియోగించండి.
5. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం..
శారీరక వ్యాయామం శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అయితే కాలుష్యం తీవ్రత ఎక్కువగా ఉంటే బయట కాకుండా ఇంటి లోపలే వ్యాయామాలు, యోగా లాంటివి చేయండి. దీనికి తోడు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, కంటినిండా నిద్రపోవడం దినచర్యలో భాగం చేసుకోండి.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
ఎడతెగని దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి లేదా ఆయాసంగా ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకుంటే పిల్లి కూతలు లాంటి శబ్దాలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ముఖ్యంగా ఆస్తమా, సీవోపీడీ (COPD) వంటి వ్యాధులు ఉన్నవారు కాలుష్య పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ, డాక్టర్ సూచించిన మందులను వాడాలి.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
