రీసైకిల్డ్ కుకింగ్ ఆయిల్ ఫుడ్ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?  

షేర్ చేయండి:
రీసైకిల్డ్ కుకింగ్ ఆయిల్ ఫుడ్ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?  

సాక్షి లైఫ్ : మీరు మీ శరీరాన్ని నిజంగా ప్రేమిస్తున్నారా..? అయితే రీసైకిల్డ్ ఆయిల్ వాడకండి. ఇదే విషయాన్ని అనేక అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. బయట దొరికే ఆహార పదార్థాలు తింటే కూడా అవి ఖచ్చితంగా ఏదొక రూపంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బయట దొరికే ఆహారపదార్థాలతయారీలో  వాడే నూనెనే మళ్లీ వాడతారు కాబట్టి. 

వంట నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించి, ఆ నూనెలో ఆహారాన్ని వేయించి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. అంతేకాదు కాలేయం, మెదడుకు కూడా తీవ్రంగా హాని కలుగుతుంది. ఆయిల్ ను ఎక్కువసార్లు ఉపయోగించి తయారుచేసిన ఆహారపదార్థాలు తినడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయంటే..? 

 ఇది కూడా చదవండి.. చిన్నారుల్లో ఎలాంటి ప్రభావాలు మానసిక సమస్యలకు కారణం అవుతాయి..? 


వంటకు వాడిన నూనెను ఎక్కువసార్లు ఉపయోగించడం వల్ల మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయి. దీని వల్ల ఫ్యాటీ లివర్, ఇతర కాలేయ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు ఇలాంటి ఆహరం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పెరుగుతాయని వారు అంటున్నారు. 

ఇది కూడా చదవండి.. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి..?  


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.