మెంతులతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
సాక్షి లైఫ్ : కొన్నిరకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఐతే ఇంకొన్ని సందర్భాల్లో వాటివల్ల దుష్ప్రభావాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మెంతుల ద్వారా కొన్నిరకాల ఆరోగ్య ప్రయోజనాలుపొందినప్పటికీ మరికొన్ని సందర్భాల్లో మాత్రం దుష్ప్రభావాలు రావొచ్చు.. అవేంటంటే..?
పాలిచ్చే తల్లులకు పాలు పడటం కోసం మెంతి పొడిని వాడతారు. దీని వల్ల పిల్లలకు ఎటువంటి హాని జరగదు. కానీ మెంతి సప్లిమెంట్లను తీసుకునే ముందు గర్భిణీలు, పాలిచ్చే మహిళలు ఖచ్చితంగా వైద్య నిపుణులను సంప్రదించాలి. లేదంటే అనేక దుష్ప్రభావాలకు గురికావాల్సి వస్తుంది.
గర్భిణీలు తప్పనిసరిగా మెంతి సప్లిమెంట్లు లేదా మందులకు దూరంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే గర్భాశయ సంకోచాలు పెరిగి అవి శిశువుపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందట. అంతేకాదు ఒక్కోసారి గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు.
డెలివరీకి ముందు మెంతులు తీసుకోవడం వల్ల శిశువుల మూత్రం, శరీరం నుంచి ఒరకమైన వాసన వస్తుంది. ఈ వాసన ప్రమాదకరం కాదు. ఐనప్పటికీ, "మాపుల్ సిరప్ యూరిన్ డిసీజ్" అనే జన్యుపరమైన పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
మెంతులు శరీరంపై ఈస్ట్రోజెన్ లాంటి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్‌లలో ఈస్ట్రోజెన్ ఆధారిత కణితులను ఇది మరింత ప్రేరేపిస్తుందని అందుకోసమే మెంతి సప్లిమెంట్లను ఉపయోగించాలనుకున్నప్పుడు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
మరికొందరిలో అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. అంతేకాదు వికారంగా, తలనొప్పిగా, తలతిరిగినట్లుగా కూడా అనిపిస్తుంది.
ఇది కూడా చదవండి.. బాదం తింటున్నారా..? జాగ్రత్త సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
