స్ట్రెస్ ను నియంత్రించే ఆహారం..  

షేర్ చేయండి:
స్ట్రెస్ ను నియంత్రించే ఆహారం..  

సాక్షి లైఫ్ : ఆధునిక జీవన విధానంలో అనేక మార్పులు, చేర్పులు వచ్చాయి. దీంతో నేటి తరంలో ఆ ప్రభావం శారీరక, మానసిక ఆరోగ్యంపై  తీవ్రంగా పడుతుంది. ఈ కారణంగా చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు.  అటువంటి పరిస్థితిలో ఒత్తిడిని సహజ పద్ధతుల ద్వారా తగ్గించుకోవాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. అందుకోసం ప్రతిరోజూ తీసుకునే  ఆహారంలో కొన్నిరకాల ఆహార పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇది కూడా చదవండి.. అధిక బరువుకు సరైన పరిష్కారం ఇది..  

మన ఆహారపు అలవాట్ల ప్రత్యక్ష ప్రభావం మన శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మన మానసిక ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఒత్తిడి సమస్య నుంచి ఉపశమనం పొందడానికి, మీరు  ఒత్తిడిని తగ్గించే ఆహారాలను చేర్చుకోవాలి.  

సీడ్స్-నట్స్.. 

ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మీరు మీ ఆహారంలో గింజలు , విత్తనాలను కూడా చేర్చుకోవచ్చు. పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలు, బాదం ,వాల్‌నట్‌లు వంటి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవచ్చు. వీటిలో జింక్, మెగ్నీషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని హరిస్తాయి. 

బెర్రీస్..  

రాస్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ , బ్లూబెర్రీస్ వంటి బెర్రీస్ కూడా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి ఆందోళన వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.


అవకాడో.. 

పొటాషియం,మోనోశాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉన్న అవకాడో ఒత్తిడిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించి, శరీరంపై ఒత్తిడి ప్రభావాన్ని తగ్గిస్తుంది.

హెర్బల్ "టీ"..  

ఒత్తిడిని తగ్గించడానికి మీరు హెర్బల్ "టీ" తీసుకోవచ్చు. బ్లాక్ టీ , లెమన్ టీ, లావెండర్ టీ వంటి హెర్బల్ టీలు తాగడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

పసుపు..  

పసుపు భారతీయ వంటశాలలలో ఉపయోగించే ఒక ప్రసిద్ధ  సుగంధ ద్రవ్యాల్లో ఒకటి.  కర్కుమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి.   

ఇది కూడా చదవండి.. క్యాన్సర్‌ను ఎలా నివారించవచ్చు..అంటే..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.