అధిక బరువుకు సరైన పరిష్కారం ఇది..  

షేర్ చేయండి:
అధిక బరువుకు సరైన పరిష్కారం ఇది..  

సాక్షి లైఫ్ : నల్ల ఉప్పులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలతో సమృద్ధిగా ఉండే ఈ ఉప్పు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచిఉపశమనం కలిగిస్తుంది. బ్లాక్ సాల్ట్ ను ప్రతి ఇంట్లో వివిధ ఆహారపదార్థాలు, పలురకాల పానీయాలలో ఉపయోగిస్తారు. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఈ ఉప్పు మంచి పనితీరును కనబరుస్తుంది.  

ఆరోగ్య ప్రయోజనాలు.. 

వంటగదిలో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలు సాధారణమైనవిగా అనిపించవచ్చు. కానీ వాటిలో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.
నల్ల ఉప్పు కూడా అలాంటిదే. దీనిని సరైన పరిమాణంలో తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. 

బ్లాక్ సాల్ట్ చాట్ లేదా సలాడ్ ల రుచిని పెంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో అనేక యాంటీఆక్సిడెంట్లు ,ఇతర పోషకాలు ఉంటాయి. 

జీర్ణ సంబంధిత సమస్యలు.. 

నల్ల ఉప్పు ఎసిడిటీ నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. తరచుగా గ్యాస్ ,అసిడిటీ వంటి సమస్యలను నిరోధించడంలో నల్ల ఉప్పు మంచి పనితీరును కనబరుస్తుంది. బ్లాక్ సాల్ట్ కాలేయ ఆరోగ్యానికి కూడా మంచిదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

జీర్ణక్రియ.. 

ఇది కూడా చదవండి.. మెదడుకు ఆక్సిజన్ ఎంతసేపటి వరకూ అందకపోతే డ్యామేజ్ అవుతుంది..? 

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, చాలా మంది ప్రజలు జీర్ణక్రియ గురించిన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి కూడా చిటికెడు నల్ల ఉప్పు చాలా మేలు చేస్తుంది. కడుపు నొప్పిని శాంతపరచడానికి ఇది పనిచేస్తుంది.

హార్ట్ హెల్త్.. 

చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి కూడా దీని వినియోగం చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మితిమీరి ఎలాంటిది తీసుకున్నా హానికరం కాబట్టి, దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

బరువు తగ్గించడంలో..  

బరువు తగ్గడానికి ప్రభావవంతంగా ఉంటుంది. నల్ల ఉప్పులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఆహారంలో సలాడ్, పానీయం వంటి మొదలైన వాటిల్లో నల్ల ఉప్పును వేసుకుంటే, అది బరువును తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.  

పురాతన కాలంలో మన పూర్వీకులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లలో బ్లాక్ సాల్ట్ తాగే వాళ్లు. ఇలా చేయడం వల్ల శరీరంలోని మలినాలు బయటకు పంపడంలో చాలా మేలు చేస్తుంది నల్ల ఉప్పు.

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 ఇది కూడా చదవండి.. పార్కిన్సన్స్ నివారణకు ఏమేం చేయాలి..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.