బ్రకోలీని ఇలా తింటే10 రెట్లు ప్రయోజనాలు పొందవచ్చు..
సాక్షి లైఫ్: పచ్చి కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. బ్రకోలీలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఐరన్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ కె వంటి పోషకాలు ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే, బ్రకోలీని సరైన పద్ధతిలో తినడం ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. అదెలా అంటే..?
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
బ్రకోలీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ప్రోటీన్ కు పవర్‌హౌస్‌గా పరిగణిస్తారు. ఇందులో ఉండే పోషకాలు శరీరం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. అయితే బ్రకోలీని సరిగ్గా ఉడికించి తింటేనే ఎక్కువ బెనిఫిట్స్ పొందడానికి వీలుకలుగుతుంది. బ్రకోలీని అనేక విధాలుగా తినవచ్చు, అవి ఆవిరిలో ఉడికించడం, వేయించడం, కాల్చడం ద్వారా అధిక ప్రయోజనాలున్నాయి.
ఆవిరిలో ఉడికించడం..
బ్రకోలీని సలాడ్‌లో లేదా గ్రిల్డ్‌లో ఉపయోగించాలనుకుంటే, ఇది సులభమైన మార్గాలలో ఒకటి. అన్నింటిలో మొదటిది, వేడినీటి కుండపై స్టీమర్ ఉంచండి. అప్పుడు బ్రకోలీని ముక్కలుగా కట్ చేసి, వాటిని సుమారు 5-7 నిమిషాలు లేదా అవి మెత్తబడే వరకు ఆవిరిలో ఉంచండి. తరువాత, కొన్ని మసాలా దినుసులు, నిమ్మరసంతో మిక్స్ చేసి సలాడ్ రూపంలో తీసుకోండి.
బ్లాంచింగ్..
బ్లాంచింగ్ పద్దతి అంటే..? బ్రకోలిని ఒక పాత్రలో మరిగించిన నీటిలో వేసి 2-3 నిమిషాలు ఉంచి, ఆతర్వాత మరొక పాత్రలో ఐస్ వాటర్ తీసుకుని అందులో ఉడికించిన బ్రకోలీ ముక్కలను ఉంచండి. చల్లబడిన తర్వాత ఫిల్టర్ చేసి, మీకుకావాల్సినప్పుడు తీనవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల బ్రకోలి చెక్కుచెదరకుండా ఉంటుంది.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
కాల్చడం..
బ్రోకలీ రుచి, రంగు , ఆకృతిని కాపాడటానికి, మీరు దానిని ఓవెన్లో కాల్చవచ్చు. దీన్ని ఉడికించడానికి, ముందుగా ఓవెన్‌ను 180 ° C-220 ° C వద్ద ముందుగా వేడి చేయండి. బ్రకోలీని ముక్కలుగా కోసి కడగాలి. ఆ తర్వాత ఆలివ్ నూనె, ఉప్పు , మిరియాలు వేయండి. అనంతరం 10-15 నిమిషాలు ఫ్రై చేయండి. బంగారు రంగులోకి వచ్చే వరకు అప్పుడప్పుడు తిప్పండి. బాగా వేగిన తర్వాత, చక్కగా తినేయవచ్చు.
వేయించడం..
బ్రకోలీని వేయించడానికి, మీడియం మంట మీద పాన్‌లో ఆలివ్ ఆయిల్ లేదా వెన్నను వేసి, తరిగిన బ్రకోలీ ముక్కాలను వేసి 5-7 నిమిషాలు మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తర్వాత ఉప్పు, మిరియాలు, మసాలా దినుసులు వేసి తినడం ద్వారా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు.
ఇది కూడా చదవండి.. వాకింగ్ Vs రన్నింగ్.. ఏది బెటర్..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
