WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
సాక్షిలైఫ్: హెపటైటిస్ వైరస్‌కు సంబంధించి తాజాగా ఓ షాకింగ్ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ హెపటైటిస్ నివేదిక 2024 వెల్లడించింది. ఈ గణాంకాల ప్రకారం హెపటైటిస్ వైరస్ కారణంగా ప్రతిరోజూ సుమారు 3500 మంది మరణిస్తున్నారు. అంతేకాదు ఈ సంఖ్య ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పెరుగుతూ ఉందని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. హెపటైటిస్ వైరస్ సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?
తాజా నివేదిక ఏం చెబుతోంది..?
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం187 దేశాల నుంచి కొత్త డేటా సేకరించారు. హెపటైటిస్ వల్ల మరణాల సంఖ్య 2019లో 1.1 మిలియన్ల నుంచి 2022 నాటికి 1.3 మిలియన్లకు పెరిగిందని తెలిపింది. 83శాతం హెపటైటిస్ బీతో, 17 శాతం హెపటైటిస్ సీ కారణంగా చనిపోతున్నారు. ఈ విషయంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డా. టెడ్రోస్ అషెన్‌హోమ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ ఈ నివేదిక చాలా ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. నివారణ ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోందని ఆయన అన్నారు. హెపటైటిస్ వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఈ వ్యాధిని ప్రపంచ వ్యాప్తంగా మరణాలకు రెండవ ప్రధాన కారణం అని ప్రకటించింది డబ్ల్యూహెచ్ఓ.
చాలా తక్కువ మంది మాత్రమే ఈ వ్యాధిని గుర్తించి చికిత్స పొందుతున్నారు. ఎక్కువమంది దీనిని గుర్తించక పోవడం వల్లే ఇలా జరుగుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ వ్యాధి గురించిన ముఖ్యమైన విషయాలను వివరంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
హెపటైటిస్..?
లివర్ సెల్స్ పాడైపోయి వాపు వస్తే దానిని హెపటైటిస్ అంటారని వైద్యులు చెబుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు, వాటిలో వైరస్లు, ఆల్కహాల్. హెపటైటిస్ A, B, C, D , E వివిధ రకాల హెపటైటిస్ వైరస్ రకాలు. ఈ వ్యాధి ప్రతి రకంలో ఇన్ఫెక్షన్ తీవ్రత, దాని వ్యాప్తి భిన్నంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.