నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

షేర్ చేయండి:
నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే 

సాక్షి లైఫ్ : మన రోజువారీ ఆహారంలో రుచికి మూలం ఉప్పు. ఉప్పు లేకుండా ఆహారం తినాలనే ఆలోచన కూడా చాలామందికి రాదు. ఉప్పు ఎక్కువైనా, తగ్గినా ఆహారం రుచి పోతుంది. వంటలో వివిధ రకాల ఉప్పును ఉపయోగిస్తారు. వాటిలో ఒకటి నల్ల ఉప్పు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. మనం నిత్యం ఉపయోగించే టేబుల్ సాల్ట్ కంటే బ్లాక్ సాల్ట్‌ తీసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం…

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?  

సాధారణ టేబుల్ సాల్ట్ కంటే బ్లాక్ సాల్ట్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నల్ల ఉప్పు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో అనేక పోషక విలువలు ఉంటాయి. కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి, వికారం, గుండెల్లో మంట వంటి సమస్యలకు ఇది సరైన ఔషధం.

పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు వంటివి పుష్కలంగా ఉండటం వల్ల బ్లాక్ సాల్ట్ మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది బ్లాక్ సాల్ట్. అందుకే చాలామంది నల్ల ఉప్పును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. 

 ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?  

ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?  

గమనిక:  ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.