ఈ ఆహారం తీసుకుంటే..రోగనిరోధక శక్తికి తిరుగే ఉండదు.. 

షేర్ చేయండి:
ఈ ఆహారం తీసుకుంటే..రోగనిరోధక శక్తికి తిరుగే ఉండదు.. 

సాక్షి లైఫ్ : ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి తప్పనిసరి. ఇది లోపిస్తే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. అందుకోసమే శారీరంలో ఇమ్యూనిటీ తగ్గకుండా చూసుకోవాలి. ఎలాంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు..? అందుకోసం ఏం చేయాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

విట‌మిన్లు అధికంగా ఉండే ఫుడ్.. 

మనం తీసుకునే ఆహారంలో ప‌సుపు, మిరియాలు, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు వంటి దినుసులు ఉండేలా చూసుకోవాలి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే "ఏ", "సి", "డి", "ఇ" విట‌మిన్లు అధికంగా ఉండే ఫుడ్ ను తీసుకోవాలి.

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకుంటే..? 

శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే కొందరిలో జ‌లుబు, జ్వ‌రం,ద‌గ్గు, ఇన్‌ఫెక్ష‌న్లు వస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకుంటే ఎలాంటి వ్యాధుల బారిన ప‌డ‌కుండా హెల్తీగా ఉండ‌వ‌చ్చు. అందుకోసం ఏమేం తీసుకుంటే బెటర్ అంటే..?  

ఇమ్యూనిటీ పవర్ పొందవచ్చు.. 

తగిన పోషకాహారం తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తిని పెంచుకోవచ్చు. బాదంప‌ప్పు, జీడిప‌ప్పు, పిస్తా, వాల్ న‌ట్స్‌ వంటివి తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఇమ్యూనిటీ పవర్ ను పొందవచ్చు. పాల‌కూర‌, మెంతికూర, తోటకూర, క్యారెట్ వంటివి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. 

 కీలక పాత్ర..  

పొద్దు తిరుగుడు విత్త‌నాలు, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, చియా గింజలు, అవిసె గింజ‌లు కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి. కోడిగుడ్లు, చికెన్‌, మ‌ట‌న్‌, త‌దిత‌ర ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. 

ఇది కూడా చదవండి..రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడిందని ఎలా గుర్తించాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.