కళ్ల సంరక్షణకు ఎలాంటి చిట్కాలు పాటించాలి..?  

షేర్ చేయండి:
కళ్ల సంరక్షణకు ఎలాంటి చిట్కాలు పాటించాలి..?  

సాక్షి లైఫ్ : ఈమధ్య కాలంలో చిన్నారుల్లో కూడా కంటి సంబంధిత సమస్యలు వస్తున్నాయి. కంటి చూపు సరిగా లేనికారణంగా వారికి తక్కువ  వయసులోనే కళ్లజోళ్లు వాడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరైన పోషకాహారం లేకపోవడంతోపాటు పలురకాల అలవాట్లతో కంటి చూపు తగ్గిపోతోంది. చూపు మందగించిన తరువాత బాధపడడం కంటే ఆయా సమస్యలు రాకుండా ముందుగా జాగ్రత్త పాడడం చాలా అవసరం. 

చూపు తగ్గిన వారికి మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆ సమస్యలు రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి ఏమేం చేయాలి..? అందుకోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి..అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

 పోషకాహారం తప్పనిసరి..  

మధుమేహం, హైబీపీ ఉన్న వారికి కంట్లోని రెటీనా పొరలో మార్పులు వస్తుంటాయి, నీటికాసుల వంటి ప్రమాదకర సమస్యలకు కూడా ముందస్తుగా ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి కళ్ల పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. "సి" విటమిన్‌ ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష,  బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.

విటమిన్లు..  

కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగి స్తుంది. కాబట్టి కంటి చూపును పెంచే ఆహార పదార్థాలను విరివిగా తీసుకోండి. అంతేకాకుండా గుడ్లు, బాదం పప్పు, పాల పదార్థాలు,చేపలు,  చిలకడదుంపలు,క్యారట్ వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. 

చత్వారం వంటివి ఉన్నపెద్దవాళ్లకే కాదు.. పిల్లలకు కూడా ఐ చెకప్ లు చేయించాలి. చూపు సమస్యలను ముందే గుర్తించకపోతే పిల్లలు చదువుల్లో వెనకబడతారు. అంతేకాదు శారీరకంగా, మానసికంగా కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఇది కూడా చదవండి.. ఎడమ చేయి లేదా కుడి చేయి గుంజినట్లు అనిపించినా గుండెనొప్పేనా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.