ఉడికించిన వేరుశెనగగింజల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. 

సాక్షి లైఫ్ : వేరుశెనగ గింజలు.. వీటినే పల్లీ అనికూడా అంటారు. ఇవి తినని వారు ఉండరు. వీటిని స్నాక్స్ లా , సలాడ్ లా, సూప్ లేదా వేయించుకొని తినడానికి ఇష్టపడతారు. అయితే కొంతమంది ఉడకబెట్టిన వేరుశెనగ గింజలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నందు వల్ల అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.. 

ఉడికించిన వేరుశెనగ ప్రయోజనాలు: మనలో చాలామంది వేరుశెనగలను ఇష్టపడతారు. అనేక పోషకాలతో కూడిన వేరుశెనగగింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలామంది వీటిని ఉపవాస సమయంలో కూడా తింటారు.  

రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి..  

డయాబెటిక్ ఉన్నవాళ్లకు ఉడికించిన వేరుశెనగగింజలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది, అంటే అనేక ఇతర స్నాక్స్‌తో పోలిస్తే, ఉడికించిన వేరుశెనగగింజలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి..  

వేరుశెనగగింజలు విటమిన్ "ఇ"కి మంచి మూలం. ఉడికించిన వేరు శెనగగింజలను క్రమం తప్పకుండా తింటే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాయి. మతిమరుపు సమస్యల నుంచి బయటపడొచ్చు. 

అధిక బరువు.. 
 బరువు తగ్గించాలనుకుంటే, ఉడికించిన వేరుశెనగలు ఒక గొప్ప ఎంపిక. అధిక కేలరీల కంటెంట్ ఉన్నప్పటికీ, ఉడికించిన వేరుశెనగ బరువు నిర్వహణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ , ఆరోగ్యకరమైన కొవ్వులు మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి, ఇవి మిమ్మల్ని ఎక్కువగా తినకుండా నిరోధిస్తాయి. తద్వారా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.

-ఉడికించిన వేరుశెనగగింజలు(పల్లీలు) తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

-వీటిలో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు , మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

-పల్లీలు తినడం వల్ల గుండెకు మెదడుకుతో సహా మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

గుండెకు మేలు..  

ఉడికించిన వేరుశెనగగింజల్లో ఉండే మోనోశాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

పోషకాలకు మూలం..  

ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి అవసరమైన పోషకాలు ఉడికించిన వేరుశెనగగింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.

ఇది కూడా చదవండి.. "టీ" తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
 

Tags : healthy-food super-food groundnuts-benefits

Related Articles

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com