Dieting to Lose Weight : సన్నబడాలని డైటింగ్ చేస్తున్నారా..? వీరు మాత్రం అస్సలు చేయకూడదు..!
సాక్షి లైఫ్ : ఈ మధ్యకాలంలో చాలామంది త్వరగా బరువు తగ్గేందుకు ఇంటర్నెట్లో చూసి కఠినమైన డైటింగ్ పాటిస్తుంటారు. అయితే, శరీరానికి అవసరమైన పోషకాలను దూరం చేసే ఇటువంటి క్రాష్ డైట్లు అందరికీ సురక్షితం కాదని, దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పిల్లలు, టీనేజర్లు..
ఇది వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అత్యంత కీలకమైన సమయం. వీరికి విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్ పుష్కలంగా అవసరం. వైద్యుల సలహా లేకుండా ఆహారం తగ్గించడం వల్ల వారి ఎదుగుదల తీవ్రంగా ప్రభావితం అవుతుంది. కడుపులోని బిడ్డకు, తల్లికి ఈ సమయంలో సరైన పోషకాలు అందాలి. బరువు తగ్గే ఉద్దేశంతో తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం ఇద్దరి ప్రాణాలకూ ప్రమాదకరం. డాక్టర్ సలహా లేకుండా డైట్లో ఎలాంటి మార్పులు చేయకూడదు.
ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?
ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
పాలిచ్చే తల్లులు..
బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లికి అదనపు శక్తి, పోషకాలు అవసరం. త్వరగా సన్నబడాలని తిండి తగ్గించడం వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోయి, తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. నిపుణుల పర్యవేక్షణలోనే వీరు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.
ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు..
ఆహారం తీసుకునే విషయంలో మానసిక సమస్యలు ఉన్నవారు కఠినమైన డైట్ పాటిస్తే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. వీరు మానసిక వైద్యుల పర్యవేక్షణలోనే బరువును అదుపు చేసుకోవాలి.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు..
మధుమేహం (diabetes), కిడ్నీ, కాలేయ సమస్యలతో బాధపడేవారికి ప్రత్యేకమైన పోషకాలు అవసరం. ఇంటర్నెట్లో చూసి సొంతంగా డైట్ చేయడం వీరికి చాలా ప్రమాదకరం. వాడే మందులకు తగ్గట్టుగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ బరువు ఉన్నవారు..ఇప్పటికే సాధారణం కంటే తక్కువ బరువు ఉన్నవారు అనవసరంగా డైటింగ్ చేస్తే తీవ్రమైన పోషకాహార లోపం, రక్తహీనత, నీరసం బారిన పడతారు.
కేవలం కడుపు మాడ్చుకున్నంత మాత్రాన బరువు తగ్గరు. ప్రొటీన్లు ఉండే సమతుల్య ఆహారం, తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకుంటూ, తగినన్ని నీళ్లు తాగుతూ ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారానే ఆరోగ్యకరంగా శరీర బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
