Testosterone : పురుషుల్లో 'టెస్టోస్టిరాన్‌' లోపిస్తే ఏం జరుగుతుంది..? కారణాలు, లక్షణాలు ఇవే..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పురుషుల ఆరోగ్యానికి అత్యంత కీలకమైన హార్మోన్ టెస్టోస్టిరాన్. కండరాలు, ఎముకల దృఢత్వంతో పాటు లైంగిక సామర్థ్యం, వీర్యకణాల ఉత్పత్తి, శరీరంలో తగినంత శక్తి ఉండేలా చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.లైంగిక కోరికలు (libido)గణనీయంగా సన్నగిల్లడం. తీవ్రమైన శారీరక అలసట, నీరసం, చిన్న పనికే శక్తి లోపించినట్లు అనిపించడం, కండరాల పరిమాణం, బలం తగ్గడం,ఎముకలు బలహీనపడటం, పెళుసుగా మారడం. ముఖం, శరీరంపై రోమాలు రాలిపోవడం లేదా వాటి ఎదుగుదల మందగించడం.. ఇవన్నీ  పురుషుల్లో 'టెస్టోస్టిరాన్‌' లోపిస్తే శరీరంలో కనిపించే మార్పులు.

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

 

టెస్టోస్టిరాన్ తగ్గడానికి ప్రధాన కారణాలు..?

వయసు పైబడటం అనేది ఒక సహజ కారణం. వృషణాలకు (Testicles) గాయాలు కావడం లేదా ఇన్ఫెక్షన్లు సోకడం. అధిక బరువు (Excess weight ), టైప్-2 డయాబెటిస్.క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ, రేడియేషన్ ప్రభావం. పిట్యూటరీ గ్రంథి సమస్యలు, నిద్రలేమి, కిడ్నీ లేదా కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు.

నిర్ధారణ, చికిత్స విధానం..

కేవలం నీరసం, అలసట, లైంగిక ఆసక్తి తగ్గడాన్ని బట్టి టెస్టోస్టిరాన్ తగ్గిందని ఎవరికి వారు సొంత నిర్ణయాలకు రాకూడదు. ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ లక్షణాలు కనిపించవచ్చు. వైద్యుల సలహా మేరకు ఉదయం పూట రక్తపరీక్షలు చేయించుకుని ఈ హార్మోన్ స్థాయిని నిర్ధారించుకోవాలి. సాధారణంగా ఉదయం వేళల్లో టెస్టోస్టిరాన్ స్థాయిలు గరిష్టంగా ఉంటాయి.

మధుమేహం, ఊబకాయం వంటివి ప్రధాన కారణమైతే.. ఆరోగ్యకరమైన పోషకాహారం, వ్యాయామం, మెరుగైన జీవనశైలి ద్వారా ఈ హార్మోన్ స్థాయిలను సహజంగా పెంచుకోవచ్చు. సమస్య తీవ్రతను బట్టి వైద్యుల (endocrinologist) పర్యవేక్షణలో 'టెస్టోస్టిరాన్ రీప్లేస్‌మెంట్ థెరపీ' (Testosterone Replacement Therapy) వంటి చికిత్సలు అవసరం కావచ్చు.

 

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.