How to Build Self-Confidence in Children : మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఇలా చేయండి.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పాఠశాల నుంచి ఇంటికి రాగానే పిల్లలను కేవలం చదువు, హోంవర్క్ గురించి మాత్రమే అడగడం సరికాదు. రోజంతా స్కూల్‌లో వారు ఎన్నో కొత్త విషయాలను అనుభూతి చెందుతారు. ఇంటికి రాగానే వారితో స్నేహపూర్వకంగా కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగితే, వారు తమ మనసులోని మాటలను మీతో పంచుకుంటారు. దీనివల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, తల్లిదండ్రులతో వారి బంధం మరింత బలపడుతుంది.

 

ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

 

పిల్లలు స్కూల్ నుంచి రాగానే అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నలు..

1. ఈ రోజు స్కూల్‌లో నీకు బాగా సంతోషాన్నిచ్చిన విషయం ఏమిటి..?

పిల్లలు ఇంటికి రాగానే ఈ ప్రశ్న అడగండి. దీనివల్ల వారు ఆ రోజంతా జరిగిన మంచి విషయాలను, సంతోషకరమైన క్షణాలను గుర్తుచేసుకుంటారు. ఇలా క్రమం తప్పకుండా అడగడం వల్ల.. ప్రతి విషయాన్ని మీతో దాచుకోకుండా పంచుకునే మంచి అలవాటు వారికి అలవడుతుంది.

2. ఈ రోజు నువ్వు ఎవరికైనా సాయం చేశావా..? లేదా నీకు ఎవరైనా సాయం చేశారా..?

ఈ ప్రశ్న పిల్లల్లో సానుభూతిని, ఇతరులకు సాయం చేయాలనే మంచి గుణాన్ని పెంపొందిస్తుంది. అలాగే స్కూల్‌లో వారి ప్రవర్తన ఎలా ఉంది, తోటి స్నేహితులతో వారు ఎలా మెలుగుతు న్నారు అనే విషయం కూడా తల్లిదండ్రులకు సులభంగా అర్థమవు తుంది.

3. ఈ రోజు కొత్తగా ఏం నేర్చుకున్నావు..?

పాఠశాలలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు ఈ ప్రశ్న అడిగినప్పుడు, వారు కొత్తగా నేర్చుకున్న విషయాలను ఎంతో ఉత్సాహంగా మీతో పంచు కుంటారు. ఇది చదువుపై వారి ఆసక్తిని మరింత పెంచుతుంది.

4. ఈ రోజు నీకు నచ్చని లేదా బాధపెట్టిన సంఘటన ఏదైనా జరిగిందా..?

పిల్లలు తమకు జరిగిన ఇబ్బందులను తమంతట తాముగా చెప్పలేరు. ఎవరైనా ఏమైనా అన్నారా..? ఏదైనా విషయం బాధపెట్టిందా? అని ప్రేమగా అడిగితే.. వారు తమ ఇబ్బందులను పంచుకుంటారు. దీని ద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యలను మీరు ముందుగానే పసిగట్టి పరిష్కరించవచ్చు.

5. రేపటికి స్కూల్‌కు ఏమైనా వస్తువులు కావాలా..?


రాత్రి నిద్రపోయే ముందు, మరుసటి రోజు స్కూల్‌కు అవసరమైన పుస్తకాలు, ప్రాజెక్ట్ సామాగ్రి లేదా ఇతర వస్తువులు ఏమైనా కావాలా అని అడగండి. దీనివల్ల ఉదయం పూట ఎలాంటి హడావుడి ఉండదు. పిల్లలు కూడా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా బడికి వెళ్తారు.

ప్రశ్నించడమే కాదు.. ఓపికగా వినాలి కూడా..!

కేవలం ప్రశ్నలు అడగడమే కాదు, పిల్లలు చెప్పే సమాధానాలను శ్రద్ధగా వినడం కూడా అంతే ముఖ్యం. వారు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా, కోప్పడకుండా విన్నప్పుడే వారు మనసు విప్పి మాట్లాడగలరు. మీ శ్రద్ధ వారిలో భద్రతా భావాన్ని కలిగించి, మీ మధ్య అనుబంధాన్ని మరింత దృఢం చేస్తుంది.

 

ఇది కూడా చదవండి..Nutritious Meal : వండే పని లేకుండానే..! 10 నిమిషాల్లోనే పౌష్టికాహారం.. 

ఇది కూడా చదవండి..Insurance Premiums : అవసరానికి మించి బీమా ప్రీమియం చెల్లిస్తున్నారా..? ఇలా సరిచూసుకోండి..!

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.