Malaria in Children During Monsoon: మాన్సూన్ లో పిల్లలను వేధిస్తున్న మలేరియా.. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకమే..!
సాక్షి లైఫ్ : వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తూ పలకరించే వర్షాలు.. అదే సమయంలో పలు ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమల ఉధృతి పెరిగి డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు వేగంగా విస్తరిస్తాయి. ఈ సీజన్‌లో మలేరియా బారినపడే వారిలో పెద్దల కంటే ఐదేళ్లలోపు పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో రోగనిరోధక శక్తి పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, వారు ఎక్కువ సమయం ఆరుబయట ఆడుకోవడం వల్ల దోమలు కుట్టే ప్రమాదం పెరుగుతోంది.
పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ వేగంగా ముదిరి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అయితే, ప్రాథమిక దశలోనే లక్షణాలను గుర్తించి సకాలంలో వైద్యం అందిస్తే మలేరియాను పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
తొలి లక్షణాలు ఎలా ఉంటాయి..?
పిల్లల్లో మలేరియా సాధారణ వైరల్ జ్వరంలానే మొదలవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కింది లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విపరీతమైన చలి, వణుకుతో కూడిన అధిక జ్వరం.జ్వరం తగ్గే సమయంలో ఒంటికి ఎక్కువగా చెమటలు పట్టడం. తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం. చిన్న పిల్లల విషయానికి వస్తే.. నిరంతరాయంగా ఏడవడం, చిరాకు పడటం, పాలు లేదా ఆహారం తీసుకోవడానికి నిరాకరించడం. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రమాదమే!మలేరియా పరాన్నజీవి శరీరంలో చేరిన తర్వాత సకాలంలో మందులు వాడకపోతే వ్యాధి తీవ్ర రూపం దాల్చుతుంది. పిల్లల్లో ఇది మూర్ఛ (Fits), స్పృహ తప్పడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు దారితీయవచ్చు. ఇన్ఫెక్షన్ ముదిరితే కాలేయం (Liver), మూత్రపిండాలు (Kidneys) దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి.. పీడకలలు రావడానికి కారణాలేంటి..?
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. వేసవికాలంలో కళ్లను కాపాడుకునేదెలా..?
యాంటీ మలేరియా మందుల కోర్సు..
వైద్యులు సూచించిన యాంటీ-మలేరియా మందుల కోర్సును మధ్యలోనే ఆపకుండా పూర్తిగా వాడటం ఎంతో ముఖ్యం. రక్షణే శ్రీరామరక్ష.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..దోమల ఉత్పత్తిని అరికట్టడం, దోమకాటు నుంచి పిల్లలను రక్షించుకోవడమే మలేరియా నివారణకు ఏకైక మార్గం. పరిసరాల పరిశుభ్రత..ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎయిర్ కూలర్లు, పాత టైర్లు, పూల కుండీలు, ట్యాంకుల్లోని నీటిని క్రమం తప్పకుండా మార్చాలి.దుస్తులు..పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు శరీరం పూర్తిగా కప్పబడేలా పొడవాటి చేతుల దుస్తులను ధరింపజేయాలి.
దోమల తెరలు..రాత్రి వేళల్లో పిల్లలను తప్పనిసరిగా దోమల తెరల (Mosquito nets) కింద పడుకోబెట్టాలి. కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేసుకోవాలి.క్రీములు.. నిపుణుల సలహాతో సురక్షితమైన మస్కిటో రిపెల్లెంట్ క్రీములను ఉపయోగించవచ్చు.వర్షాకాలంలో పిల్లల్లో ఎలాంటి జ్వరం కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించడం శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి.. ప్రాణాంతకమైన వ్యాధులకు కారణమయ్యే జంతువులు..
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. తినే ఆహారానికి, అనారోగ్య సమస్యలకు లింక్ ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
