Parenting Tips: పిల్లల పెంపకంలో చేసే ఈ 5 తప్పులే వారిని 'మొండివారుగా' మారుస్తాయి..!
సాక్షి లైఫ్ : పిల్లల పెంపకం (Parenting) అనేది ఎంతో బాధ్యతాయుత మైన, సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఇందులో ఏ చిన్న పొరపాటు జరిగినా అది పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నేటి కాలంలో పిల్లల ప్రవర్తనలో వేగంగా మార్పులు వస్తున్నాయి. పిల్లలు మొండిగా, కోపంగా మారుతున్నారని తల్లిదండ్రులు తరచూ ఆందోళన చెందుతుంటారు. కానీ, దీని వెనుక అసలు కారణం ఇంట్లోని వాతావరణం, పెంపకంలో లోపాలేనని నిపుణులు చెబుతున్నారు.
చిన్నచిన్న పొరపాట్లే పిల్లల స్వభావాన్ని నెమ్మదిగా ప్రభావితం చేస్తాయి. వాటిని సకాలంలో సరిదిద్దుకోకపోతే పిల్లలు మీ మాట వినకుండా ఎదురుతిరిగే ప్రమాదం ఉంది. పిల్లలు బాధ్యతాయుతంగా పెరగాలంటే తల్లిదండ్రులు కొన్ని తప్పులకు దూరంగా ఉండాలి.
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి..Chest Pain : ఛాతీలో నొప్పా..? అది గుండెపోటా..? లేక పానిక్ అటాకా..? తేడా ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. ఆయుష్షు రహస్యాలను గురించి చెప్పిన 111ఏళ్ల వృద్ధుడు..
తల్లిదండ్రులు చేయకూడని 5 ప్రధాన తప్పులివే..
ప్రతి చిన్నదానికీ అరవడం, పిల్లలను ఎప్పుడూ కంట్రోల్ చేయాలని చూడటం వల్ల వారి మనసులో భయం, కోపం పెరుగుతాయి. దీనివల్ల వారు తమ మనసులోని మాటను మీతో స్వేచ్ఛగా పంచుకోలేరు. నెమ్మదిగా వారిలో నిరసన భావం పెరిగి ఎదురుతిరుగుతారు. పిల్లల పెంపకంలో క్రమశిక్షణ అవసరమే కానీ, అందులో సమతుల్యత ఉండాలి.
పిల్లల మాటను పట్టించుకోకపోవడం..
తల్లిదండ్రులు పిల్లల మాటలను, వారి భావోద్వేగాలను విస్మరిస్తే.. వారు మానసికంగా ఒంటరితనానికి గురవుతారు. తమ మాటను ఎవరూ వినడం లేదనే బాధతో, మీ దృష్టిని ఆకర్షించడం కోసమే వారు మొండిగా, విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెడతారు.
ఇతరులతో పోల్చి మాట్లాడటం..
"పక్కింటి పిల్లాడిని చూసి నేర్చుకో.. వాడు ఎంత బుద్ధిగా ఉన్నాడో" వంటి మాటలు పిల్లల ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. ప్రతిక్షణం ఇతరులతో పోల్చడం వల్ల వారిలో న్యూనతాభావం (Inferiority complex) పెరిగిపోతుంది. ఇది వారిని తల్లిదండ్రులకు దూరం చేసి, తిరుగుబాటు స్వభావాన్ని అలవర్చుకునేలా చేస్తుంది.
అతిగారాబం, మితిమీరిన స్వేచ్ఛ..
కఠినంగా ఉండటం ఎంత తప్పో, అవసరానికి మించి స్వేచ్ఛను ఇవ్వడం కూడా అంతే తప్పు. పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వారు క్రమశిక్షణను నేర్చుకోలేరు. ప్రతిదీ తమ ఇష్టప్రకారమే జరగాలనే అలవాటు పడిపోతారు. తదనంతర కాలంలో కనీస నియమ నిబంధనలను పాటించడానికి కూడా వారు ససేమిరా అంటారు.
తగినంత సమయం కేటాయించకపోవడం..
ఉరుకులు పరుగుల బిజీ జీవితంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలతో గడిపేందుకు తగినంత సమయం కేటాయించ లేకపోతున్నారు. దీనివల్ల పిల్లలు భావోద్వేగపరంగా బలహీనపడతారు. మీరు వారితో సమయం గడపనప్పుడు, మీ దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి వారు ఉద్దేశపూర్వకంగానే తప్పులు చేయడం లేదా అల్లరి చేయడం చేస్తుంటారు. పిల్లలు పువ్వుల్లాంటి వారు. వారి మనసు అర్థం చేసుకుని, స్నేహపూర్వక వాతావరణంలో పెంచితేనే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. మీ పెంపకంలో ఈ పొరపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దుకోండి.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. WHO Report : ఈ వ్యాధి ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతోంది..
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
