శిశు పోషణకు ప్రత్యేక శ్రద్ధ అవసరం.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పంచదార వద్దు, బెల్లమే ముద్దు : శుద్ధి చేసిన పంచదారను అస్సలు ఉపయోగించకూడదని, అవసరమైతే బెల్లం మాత్రమే వాడాలని మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచించింది. బెల్లం వాడకాన్ని కూడా మొత్తం శక్తిలో 5 శాతానికి మించకుండా పరిమితం చేయాలని తెలిపింది, తద్వారా అధిక కేలరీల వినియోగాన్ని నివారించవచ్చని పేర్కొంది.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

ఉప్పు నియంత్రణ : అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర (HFSS) ఉన్న ఆహార పదార్థాలను అన్ని వయసుల వారు, లింగ భేదం లేకుండా తప్పనిసరిగా నివారించాలి. ఉప్పు వాడకాన్ని కూడా పరిమితం చేయాలి. లబ్ధిదారుల అభిరుచికి అనుగుణంగా ఉప్పు, చక్కెర కలపకుండా టేక్-హోమ్ రేషన్ రెసిపీలను రూపొందించాలని రాష్ట్రాలకు సూచించారు.

తీపి వంటకాలు : ఉదయం స్నాక్స్, తీపి వంటకాల సంఖ్యను తగ్గించాలని, అనుబంధ పోషకాహారం ఉత్పత్తికి ఉపయోగించే పదార్థాలు సురక్షితంగా ఉండాలని, ఆహార భద్రత, ప్రమాణాల నిబంధనలు, 2011కి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు.

శిశు పోషణకు ప్రత్యేక శ్రద్ధ: 2 సంవత్సరాల లోపు పిల్లల కోసం ఉద్దేశించిన ఆహార పదార్థాలు కృత్రిమ ప్రిజర్వేటివ్‌లు, రంగులు, రుచులు, ఇతర సింథటిక్ పదార్థాలు లేకుండా ఉండాలని, ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అనుమతించిన ఉత్పత్తులను మాత్రమే వాడాలి.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.