ఆఫ్రికాలో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : Mpox ను Monkeypox అంటారు. ప్రస్తుతం ఈ Mpox వైరస్ ప్రపంచదేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఆఫ్రికాలో మంగళవారం ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 15,000 కంటే ఎక్కువ MPox కేసులు నమోదయ్యాయి. MPOX వ్యాప్తి కాంగో నుంచి పొరుగు దేశాలకు వ్యాప్తి చెందుతూనే ఉంది. దీని దృష్ట్యా ఆఫ్రికాలోని అత్యున్నత ప్రజారోగ్య సంస్థ మంగళవారం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దగ్గరి పరిచయం ద్వారా Mpox వ్యాపిస్తుంది.

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో వచ్చే సాధారణ రకాల జ్వరాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఔషధాలతో పని లేకుండా చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చా..?

ఇది ఫ్లూ లాంటి లక్షణాలను కలిగి ఉంటుంది.  కొన్ని సందర్భాలలో ఇది ప్రాణాంతకం కావచ్చు. 2022లో వైరస్ వందకు పైగా దేశాలకు వ్యాపించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) దీనిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మనిషి నుంచి మనిషికి సోకే అవకాశాలు కూడా ఉన్నాయని, ఇది ఎలుకలు, ఉడుతలు కోతులు వంటి జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది.   

ఈ వైరస్ పిల్లల్లో అత్యంత వేగంగా.. 

కాంగోలో కొత్త వేరియంట్, క్లాడ్ ఎల్ బీ అని పిలుస్తున్నారు, సాధారణ సన్నిహిత పరిచయం ద్వారా మరింత సులభంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (ఆఫ్రికా సిడిసి) గత వారం వైరల్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి రేటు ఆందోళనకరంగా ఉందని హెచ్చరించింది.


ఈ ఏడాది ఇప్పటి వరకు 15 వేలకు పైగా కేసులు..

ఈ ఏడాది ఇప్పటివరకు 15,000 కంటే ఎక్కువ MPox కేసులు నమోదవ్వగా 461 మరణాలు సంభవించాయి. గతేడాదితో పోలిస్తే ఇది 160శాతం పెరిగింది. 1970లలో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మానవులలో మొదటిసారి కనుగొన్నారు. ఆ తర్వాత దశాబ్దాలుగా ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో Mpox వ్యాప్తి కొనసాగుతుంది.

ఇది కూడా చదవండి..ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలంటే ఏమి చేయాలి..?

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.