Osteoarthritis : మోకాలి కీళ్ల అరుగుదల ఏ దశలో ఉన్నప్పుడు నాన్-సర్జికల్ చికిత్సలు సమర్థవంతంగా పనిచేస్తాయి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కీళ్ల మధ్య ఉండే జిగురు లేదా గుజ్జు (synovial fluid) సహజంగా తిరిగి పెరిగే మార్గాలు ఉన్నాయా..? ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే మోకాలి నొప్పులు రావడానికి ప్రధాన కారణాలేంటి, అసలు ఈ సమస్యను తొలిదశలోనే ఎలా గుర్తించాలి..? మోకాలి నొప్పులతో బాధపడేవారు ఎలాంటి వ్యాయామాలు చేయాలి, రోజూ చేసే నడక (walking) వారికి మేలు చేస్తుందా లేక కీళ్లను మరింత దెబ్బతీస్తుందా? తొడ ముందు భాగంలోని క్వాడ్రిసెప్స్ కండరాలను బలోపేతం చేయడం ద్వారా మోకాలిపై పడే భారాన్ని తగ్గించవచ్చా?

సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి ఎంతవరకు సురక్షితం, ఎలాంటి కదలికలు లేదా వ్యాయామాలకు దూరంగా ఉండాలి? బరువు తగ్గడం వల్ల కీళ్లపై ఒత్తిడి ఎంతమేర తగ్గుతుంది, అలాగే విటమిన్ డి3, కాల్షియం, ఒమేగా-3 వంటి పోషకాలు, ఆహార నియమాలు నొప్పి నివారణలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి?

మోకాలి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు వేడి నీటి కాపడం పెట్టాలా లేక ఐస్ ప్యాక్ వాడాలా? రోజంతా నీ-క్యాప్ (Knee Cap) ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుందా లేక కండరాలు బలహీనపడతాయా? కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం, నేలపై పడుకోవడం వల్ల సమస్య తీవ్రమవుతుందా? పాశ్చాత్య (వెస్ట్రన్) టాయిలెట్ వాడకం ఒత్తిడిని ఎంతవరకు తగ్గిస్తుంది?

 

ఆయుర్వేద నూనెల మర్దన వల్ల శాశ్వత పరిష్కారం లభిస్తుందా, తాత్కాలిక ఉపశమనం కోసం వాడే పెయిన్ కిల్లర్ మందులు మూత్రపిండాలపై ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతాయి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నందకిషోర్ ఎర్రంశెట్టి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.