Humidifier vs Air Purifier : చలికాలంలో హ్యుమిడిఫైయరా.. ఎయిర్‌ ప్యూరిఫైయరా..? మీ ఇంటికి ఏది అవసరం..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చలికాలం మొదలైందంటే చాలు, చల్లని గాలి లోపలికి రాకుండా కిటికీలు, తలుపులు మూసేసి ఉంచుతాం. దీనివల్ల గదిలోకి స్వచ్ఛమైన గాలి ప్రసరణ తగ్గిపోతుంది. దీనికి తోడు చలిని తట్టుకోవడానికి రూమ్‌ హీటర్లు వాడటం వల్ల గదిలోని తేమ శాతం పడిపోయి గాలి పొడిగా మారుతుంది. మరోవైపు బయట పెరుగుతున్న వాయు కాలుష్యం, దుమ్ముధూళి కూడా ఇంట్లోని గాలి నాణ్యతను దెబ్బతీస్తాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు హ్యుమిడిఫైయర్‌ కొనాలా..? లేదంటే..? ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ తీసుకోవాలా..? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. నిజానికి ఈ రెండు పరికరాల పనితీరు వేర్వేరుగా ఉంటుంది. మీ ఇంటి అవసరాలకు ఏది సరైనది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్‌ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..: Electric Comb : బట్టతలకు ఎలక్ట్రిక్ దువ్వెన తో చెక్ పెట్టొచ్చు.. 97.85శాతం జుట్టు పెరుగుదల.. 

 

హ్యుమిడిఫైయర్‌ ఏం చేస్తుంది..?

గదిలోని పొడి గాలిలో తేమ శాతాన్ని పెంచడానికి హ్యుమిడిఫైయర్‌ ఉపయోగపడుతుంది. చలికాలంలో సహజంగానే గాలి పొడిబారు తుంది. దీనికి హీటర్ల వినియోగం తోడవడంతో చర్మం పొడిబారడం, పెదాలు పగలడం, గొంతు ఎండిపోవడం, ముక్కులో మంట వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి సందర్భాల్లో హ్యుమిడిఫైయర్‌ గదిలో తగినంత తేమను నిలిపి ఉపశమనం కలిగిస్తుంది.

ఎప్పుడు కొనుగోలు చేయాలి..?

గదిలోని గాలి మరీ పొడిగా అనిపిస్తున్నప్పుడు.

చర్మం, పెదాలు, గొంతు తరచుగా పొడిబారుతున్నప్పుడు.

రూమ్‌ హీటర్‌ వాడిన తర్వాత గదిలో తేమ తగ్గిపోయినట్లు అనిపిస్తే.

గదిలో తేమ స్థాయి (humidity) 30 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు. (సాధారణంగా ఇంట్లో తేమ స్థాయి 30 నుంచి 50 శాతం మధ్య ఉండటం ఆరోగ్యకరం).

ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ ఎందుకు అవసరం..?

ఇంట్లోని గాలిలో ఉండే దుమ్ము, కాలుష్య కారకాలు, అలర్జీ కలిగించే సూక్ష్మ కణాలను తొలగించి గాలిని శుభ్రం చేయడమే ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ ప్రధాన విధి. ఇందులో ఉండే ‘హెపా’ (HEPA) ఫిల్టర్‌ గాలిలోని అతి సూక్ష్మమైన హానికర కణాలను సైతం సమర్థంగా వడపోస్తుంది. చలికాలంలో బయట కాలుష్యం పెరిగి, ఆ గాలి ఇంట్లోకి చేరినప్పుడు ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ ఎంతో మేలు చేస్తుంది.

ఎప్పుడు కొనుగోలు చేయాలి..?

మీరు నివసించే ప్రాంతంలో దుమ్ము, వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటే..? కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా దుమ్ము లేదా పుప్పొడి వల్ల అలర్జీ సమస్యలు ఉంటే..? ఇంట్లో పెంపుడు జంతువులు ఉండి, వాటి వెంట్రుకలు గాలిలో చేరుతుంటే..? వంట చేసేటప్పుడు వచ్చే పొగ, బయటి కాలుష్యం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఇవి అవసరం. 

రెండింటినీ ఒకేసారి వాడొచ్చా..?

అవసరాన్ని బట్టి హ్యుమిడిఫైయర్‌, ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ రెండింటినీ ఒకే గదిలో ఉపయోగించవచ్చు. మీ గదిలో గాలి పొడిబారడంతో పాటు కాలుష్య సమస్య కూడా తీవ్రంగా ఉంటే ఈ రెండు పరికరాలు మంచి ఫలితాన్నిస్తాయి. అయితే, వీటిని ఒకదానికొకటి కాస్త దూరంగా ఉంచడం ముఖ్యం. హ్యుమిడిఫైయర్‌ నుంచి వెలువడే తేమ నేరుగా ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ ఫిల్టర్‌పై పడితే, ఆ ఫిల్టర్‌ పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.