Magnesium : నిద్ర, కండరాలు, గుండె ఆరోగ్యానికి ‘మెగ్నీషియం’ కీలకం.. మీలో దీని లోపం ఉందా..?
సాక్షి లైఫ్ : శరీరం ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండాలంటే కేవలం విటమిన్లు మాత్రమే కాదు, ఖనిజ లవణాలు (minerals) కూడా ఎంతో అవసరం. మన శరీరానికి ఇవి తక్కువ పరిమాణంలోనే అవసరమైనప్పటికీ, అవి నిర్వర్తించే పాత్ర మాత్రం చాలా కీలకం. అలాంటి ముఖ్యమైన ఖనిజాల్లో ‘మెగ్నీషియం’ (Magnesium) ఒకటి. కండరాలు, నరాలు, ఎముకలు, గుండె పనితీరు సక్రమంగా సాగడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు, శరీరంలో శక్తి ఉత్పత్తికి, రక్తపోటు (blood pressure), రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
వైద్య నివేదికల ప్రకారం, వయోజనులకు ప్రతిరోజూ దాదాపు 310 నుంచి 420 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరం. అయితే, మారిన ఆహారపు అలవాట్ల కారణంగా నేడు చాలామందిలో దీని లోపం కనిపిస్తోంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే మొత్తం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెగ్నీషియం లోపిస్తే తలెత్తే సమస్యలివే..
కండరాల నొప్పులు, అలసట.. కండరాలు సంకోచించడానికి, విశ్రాంతి తీసుకోవడానికి మెగ్నీషియం అవసరం. దీని లోపం వల్ల కండరాలు పట్టేయడం (cramps), వణుకు, నీరసం, విపరీతమైన అలసట వంటివి వేధిస్తాయి.
నిద్రలేమి, చిరాకు (Insomnia and irritability)..
నరాల సాధారణ పనితీరుపైనా, శరీరంలో శక్తి ఉత్పత్తిపైనా దీని ప్రభావం ఉంటుంది. ఫలితంగా మానసిక ఆందోళన, చిరాకు, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గుండె కొట్టుకునే వేగాన్ని (heartbeat) సాధారణ స్థితిలో ఉంచడానికి మెగ్నీషియం ఎంతో అవసరం. దీని లోపం తీవ్రంగా ఉన్నవారిలో గుండె దడ లేదా లయ తప్పడం, బీపీలో హెచ్చుతగ్గులు, శరీరంలోని ఇతర ఖనిజాల సమతుల్యత దెబ్బతినడం వంటి ప్రమాదాలు ఎదురవుతాయి.
ఈ ఆహారంతో లోపాన్ని అధిగమించవచ్చు..!
రోజువారీ ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా మెగ్నీషియం లోపాన్ని సులభంగా భర్తీ చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలలో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. తాజా ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలను నిత్యం భోజనంలో భాగం చేసుకోవాలి. ఒకవేళ శరీరంలో మెగ్నీషియం లోపం తీవ్రంగా ఉన్నట్లు తేలితే, సొంత వైద్యం చేసుకోకుండా వైద్యుల పర్యవేక్షణలో తగిన సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
