Silent Eye Disease : ఎలాంటి లక్షణాలు లేకుండానే కంటి నరాన్ని దెబ్బతీసే వ్యాధి.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దగ్గరి, దూరపు వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. కళ్లలో ఎలాంటి నొప్పి లేదు.. కళ్లద్దాల పవర్ కూడా పెరగలేదు.. కాబట్టి మన కళ్లు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయని చాలామంది భావిస్తుంటారు. కానీ, ఈ అంచనా ఎప్పుడూ నిజం కాకపోవచ్చని నేత్ర వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చిన్నవయసు వారిలోనూ కంటి సమస్యలు పెరుగుతున్నాయి. కేవలం శుక్లాలు (cataract) మాత్రమే కాదు, ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే చూపును హరించే ‘గ్లకోమా’ (glaucoma)వంటి తీవ్రమైన వ్యాధులు లోలోపలే పెరుగుతూ ఉండొచ్చు.

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..: Electric Comb : బట్టతలకు ఎలక్ట్రిక్ దువ్వెన తో చెక్ పెట్టొచ్చు.. 97.85శాతం జుట్టు పెరుగుదల.. 

ఇది కూడా చదవండి..Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?

 

ఏమిటీ ‘నిశ్శబ్ద శత్రువు’..?

కంటి వెనుక ఉండి, మనం చూసే దృశ్యాలను మెదడుకు చేరవేసే ఆప్టిక్ నరం (Optic Nerve) దెబ్బతినడం వల్ల గ్లకోమా వస్తుంది. ఈ వ్యాధి ప్రారంభ దశలో ఎలాంటి నొప్పి గానీ, చూపు మందగించడం గానీ కనిపించదు. అందుకే వైద్య పరిభాషలో దీనిని ‘చూపును దొంగిలించే నిశ్శబ్ద శత్రువు’ (Silent Thief of Sight) అని పిలుస్తారు. చాలామందికి కంటి నరం గణనీయంగా దెబ్బతిన్న తర్వాతే తమకు ఈ సమస్య ఉందని తెలుస్తుంది.

ముదిరేకొద్దీ కనిపించే లక్షణాలు.. 

తొలి దశలో గ్లకోమాను గుర్తించడం కష్టమే అయినప్పటికీ, వ్యాధి పెరిగేకొద్దీ కింది మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఎదురుగా ఉన్న వస్తువులు బాగానే కనిపించినా, పక్కల ఉన్న వస్తువులు క్రమంగా కనిపించడం తగ్గిపోతుంది.

పరిసరాలను గుర్తించడంలో ఇబ్బంది.. చుట్టుపక్కల ఉన్న వస్తువులను సరిగ్గా అంచనా వేయలేకపోవడం. చూపులో మచ్చలు..చూసే దృశ్యంలో అక్కడక్కడా నల్లటి మచ్చలు లేదా ఖాళీ ప్రదేశాలు (blind spots) కనిపించడం. చూపు పరిధి కుంచించుకుపోవడం: వ్యాధి తీవ్రమైతే కేవలం ఒక గొట్టం ద్వారా చూస్తున్నట్లుగా (tunnel vision) చూపు పరిధి చాలా పరిమితమైపోతుంది.

ఎవరికి ముప్పు ఎక్కువ..?

గ్లకోమా ఎవరికైనా రావచ్చు. అయితే, కొన్ని వర్గాల వారికి దీని ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడిన వారు..వయసు పెరిగేకొద్దీ గ్లకోమా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ చరిత్ర..తల్లిదండ్రులు లేదా రక్తసంబంధీ కులలో ఎవరికైనా గ్లకోమా ఉంటే, మిగిలిన వారికి వచ్చే ప్రమాదం ఎక్కువ.

కంటి ఒత్తిడి..కంటిలోపల ఒత్తిడి (high intraocular pressure) ఎక్కువగా ఉండేవారు. ఇతర కంటి సమస్యలు..ఇప్పటికే ఇతర నేత్ర వ్యాధులతో బాధపడు తున్నవారు గ్లకోమా వల్ల ఒకసారి కంటి నరం దెబ్బతింటే, కోల్పోయిన చూపును తిరిగి తీసుకురావడం సాధ్యం కాదు. అయితే, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా దీనిని తొలి దశలోనే గుర్తించవచ్చు. సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే వ్యాధి మరింత ముదరకుండా అడ్డుకుని, మిగిలిన చూపును జీవితాంతం సురక్షితంగా కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్‌ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.