Health tips : రోజూ ఒక నిమ్మకాయ రసం తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలివే..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాసు నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం చాలా మంది దినచర్యలో భాగం. నిమ్మరసంలో విటమిన్-సి పుష్కలంగా ఉండటంతో పాటు, ఇది శరీరాన్ని రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ ఒక నిమ్మకాయను నీటిలో పిండుకుని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

డీహైడ్రేషన్ దూరం..

సాదా నీరు తాగలేని వారు నిమ్మరసం కలుపుకోవడం వల్ల ఎక్కువ నీరు తాగే అలవాటు ఏర్పడుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి, జీవక్రియలు సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

విటమిన్ 'సి'..

 యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే విటమిన్-సి నిమ్మలో మెండుగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా.. చర్మం, ఎముకలు, కణజాలాల ఆరోగ్యానికి అవసరమైన 'కొల్లాజెన్' ఉత్పత్తికి తోడ్పడుతుంది.

మెరుగైన జీర్ణక్రియ..

భోజనం చేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది, కడుపులో తేలికగా అనిపిస్తుంది. చక్కెర పానీయాలకు ప్రత్యామ్నాయం.. సోడాలు, పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ బదులుగా చక్కెర కలపని నిమ్మరసం తాగడం ఉత్తమం. దీనివల్ల శరీరంలోకి అదనపు క్యాలరీలు చేరవు, తద్వారా బరువు అదుపులో ఉంటుంది.

కిడ్నీ రాళ్ల నివారణ..


నిమ్మకాయలో ఉండే 'సిట్రేట్' లక్షణాలు కొన్ని రకాల కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా అడ్డుకోవడంలో సహాయపడతాయి. తగినన్ని నీళ్లతో కలిపి తీసుకుంటే మెరుగైన ఫలితం ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

నిమ్మరసంలోని ఆమ్లత్వం (citric acid) ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీన్ని అతిగా తాగితే దంతాల పైపొర అంటే ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. నిమ్మరసం తాగిన వెంటనే మంచి నీటితో నోరు పుక్కిలించడం మంచిది. గ్యాస్, ఎసిడిటీ, ఛాతీలో మంట సమస్యలతో బాధపడేవారు నిమ్మరసానికి దూరంగా ఉండటం లేదా వైద్యుల సలహా మేరకు పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. నిమ్మరసాన్ని బరువు తగ్గించే మాయాజాలంగా లేదా సర్వరోగ నివారిణిగా భావించకూడదు. పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం, సరైన జీవనశైలితో పాటు దీనిని ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా మాత్రమే కొనసాగించాలి.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.