Eating Expired Food : గడువు ముగిసిన ఆహారం తింటున్నారా..? ప్రాణాలకే ప్రమాదం..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్యాక్ చేసిన ఆహార పదార్థాల గడువు తేదీలను (expiry dates on packaged food products) నిర్లక్ష్యం చేయడం ఆరోగ్యానికి తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుంది. ఇటీవల మార్కెట్లో గడువు ముగిసిన వస్తువుల లేబుల్స్ మార్చి, కొత్త తేదీలు ముద్రించి విక్రయిస్తున్న మోసాలు వెలుగుచూడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆహార పదార్థాల కొనుగోలు, నియమ నిబంధనలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?  

'ఎక్స్‌పైరీ డేట్', 'బెస్ట్ బిఫోర్' మధ్య తేడా..?

ప్యాకెట్లపై ఉండే 'ఎక్స్‌పైరీ డేట్', 'బెస్ట్ బిఫోర్' అనే రెండు పదాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయి. ఎక్స్‌పైరీ డేట్.. ఈ తేదీ దాటిన తర్వాత ఆ వస్తువును వినియో గించడం ఏమాత్రం సురక్షితం కాదు. దాన్ని కచ్చితంగా పారేయా ల్సిందే. బెస్ట్ బిఫోర్.. ఆ వస్తువు పూర్తి నాణ్యతతో, అసలైన రుచితో ఆ తేదీ వరకు మాత్రమే ఉంటుందని దీని అర్థం. ఆ తర్వాత దాని నాణ్యత క్రమంగా తగ్గుతుంది.

పొంచి ఉన్న ప్రాణాపాయం..

గడువు ముగిసిన ఆహారంలో హానికరమైన బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. రసాయన చర్యల వల్ల ఆ ఆహారం పూర్తిగా విషపూరితంగా (food poisoning) మారుతుంది. దీనిని తినడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కలగడమే కాకుండా, శరీరంలోని కీలక అవయవాలపై ప్రభావం పడి కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం సంభవించే ముప్పు కూడా ఉంది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) నిబంధనలు - రెడ్ లేబుల్ హెచ్చరిక..


ఆహార కల్తీ, గడువు ముగిసిన వస్తువుల విక్రయాలను అడ్డుకునేందుకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, వినియోగదారులను సులభంగా అప్రమత్తం చేసేందుకు ప్యాకెట్లపై ప్రత్యేకంగా 'ఎరుపు రంగు హెచ్చరిక లేబుల్' (Red Warning Label) ముద్రించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. వినియోగదారులు కూడా దుకాణాలు లేదా సూపర్ మార్కెట్లలో వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తయారీ, గడువు ముగింపు తేదీలను తప్పనిసరిగా సరిచూసుకోవాలి. ప్యాకింగ్ దెబ్బతిన్నా, తేదీల దగ్గర చెరిపేసిన గుర్తులున్నా వాటిని కొనుగోలు చేయరాదు.

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.