videos
Antibiotics : ప్రతి జలుబుకూ యాంటీబయాటిక్స్ అవసరమా..?
సాక్షి లైఫ్ : పిల్లల్లో ఏ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి? జలుబు, దగ్గు ఎప్పుడు న్యుమోనియా లేదా ఆస్తమా వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి? ప్రతి దగ్గుకు దగ్గు సిరప్ లేదా ప్రతి జ్వరానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం సరైనదేనా? డాక్టర్ సలహా లేకుండా మందులు వాడితే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి? సోషల్ మీడియాలో వచ్చే ఆరోగ్య చిట్కాలను ఎంతవరకు నమ్మాలి? పిల్లల కోసం ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఫస్ట్ ఎయిడ్ వస్తువులు ఏమిటి? రెగ్యులర్ హెల్త్ చెకప్ ఎంత ముఖ్యమైనది? స్క్రీన్ టైమ్, నిద్ర, శారీరక ఆటలు పిల్లల ఇమ్యూనిటీపై ఎలా ప్రభావం చూపుతాయి? నేటి తల్లిదండ్రులు ఎక్కువగా చేసే ఆరోగ్య సంబంధిత పొరపాట్లు ఏమిటి? చివరగా, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రతిరోజూ పాటించాల్సిన ముఖ్యమైన ఐదు అలవాట్లు ఏమిటి? పిల్లల్లో తరచూ జలుబు, దగ్గు రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి? వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల మధ్య తేడాను తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? జలుబు వచ్చినప్పుడు ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎంత రోజుల వరకు దగ్గు కొనసాగితే వైద్యుడిని తప్పనిసరిగా సంప్రదించాలి? పిల్లలకు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ లోపలకు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి ఎంత ప్రమాదకరం? చల్లటి నీరు, ఐస్‌క్రీమ్ లేదా అరటిపండు వల్లే జలుబు వస్తుందనేది నిజమేనా? స్టీమ్ ఇవ్వడం, నెబ్యులైజర్ వాడడం ప్రతి పిల్లవాడికి సురక్షితమేనా? పిల్లల్లో రోగనిరోధక శక్తిని సహజంగా పెంచడానికి తల్లిదండ్రులు ఏమి చేయాలి? పిల్లలకు అతిగా తినిపించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? "బాగా తింటేనే బాగా పెరుగుతారు" అనే భావన ఎంతవరకు నిజం? పిల్లలు తిననప్పుడు బలవంతంగా తినిపించడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? టీవీ లేదా మొబైల్ చూపిస్తూ తినిపించడం ఎంత ప్రమాదకరం? ఓవర్‌ఫీడింగ్ వల్ల ఊబకాయం, ఫ్యాటీ లివర్, మధుమేహం వంటి సమస్యలు చిన్న వయసులోనే వచ్చే అవకాశముందా? పిల్లలకు రోజుకు ఎంత పరిమాణంలో ఆహారం ఇవ్వాలి? పాలు, గుడ్లు, పండ్లు, ప్రోటీన్ ఎంత అవసరం? జంక్ ఫుడ్, స్వీట్లు, ప్యాకెట్ ఫుడ్స్ తరచూ ఇవ్వడం వల్ల దీర్ఘకాలంలో ఎలాంటి నష్టాలు కలుగుతాయి? పిల్లలు ఆకలి లేదంటే ఎలా స్పందించాలి? మల్టీవిటమిన్లు లేదా సప్లిమెంట్లు ప్రతి పిల్లవాడికి అవసరమా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్యనిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియోచూసి తెలుసుకోండి..గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
