Immunity : వింటర్ లో రోజూ పసుపు పాలు తాగుతున్నారా..? రోగనిరోధక శక్తిపై వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది..?
సాక్షి లైఫ్ : వాతావరణంలో మార్పులు, చలికాలం మొదలవగానే సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. ఈ సమయంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలామంది రాత్రిపూట గోరువెచ్చని పసుపు పాలు (golden milk) తాగడానికి ఇష్టపడతారు. అయితే, కేవలం పసుపు పాలు తాగడం వల్లే మన రోగనిరోధక శక్తి (immunity) పూర్తిగా పెరుగుతుందా..? వైద్యనిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
పసుపు పాలతో కలిగే ప్రయోజనాలు..
భారతీయ వంటగదిలో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో 'కర్క్యుమిన్' (Curcumin) అనే శక్తివంతమైన సమ్మేళనం ఉంటుంది. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే..యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు..పసుపులోని కర్క్యుమిన్ శరీరంలోని అంతర్గత ఇన్ఫ్లమేషన్(inflammation) తగ్గించడంలో సహాయపడుతుంది.యాంటీ ఆక్సిడెంట్లు.. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative stress) నుంచి కాపాడతాయి. పాల ద్వారా శరీరానికి అవసరమైన ప్రొటీన్, కాల్షియం వంటి పోషకాలు అందుతాయి. చలికాలంలో గోరువెచ్చని పసుపు పాలు తాగడం వల్ల గొంతుకు, శరీరానికి హాయిగా, ఉపశమనంగా అనిపిస్తుంది.
ఇమ్యూనిటీ పెరగడానికి ఇదొక్కటే సరిపోతుందా..?
పసుపులోని కర్క్యుమిన్ రోగనిరోధక వ్యవస్థపై చూపే ప్రభావంపై పలు పరిశోధనలు జరిగాయి. అయితే, కేవలం రోజూ పసుపు పాలు తాగినంత మాత్రాన ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయని లేదా రోగనిరోధక శక్తి అమాంతం పెరిగిపోతుందని కచ్చితంగా చెప్పలేమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మన రోగనిరోధక వ్యవస్థ అనేది అనేక కణాలు, కణజాలాలు, అవయవాల సమన్వయంతో పనిచేస్తుంది. దీనిని బలోపేతం చేయడానికి కేవలం ఒక పానీయంపైనే ఆధారపడకుండా సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పని వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పాటించడం ఎంతో అవసరం.
పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే..?
సాధారణ మోతాదులో పసుపు పాలు తీసుకోవడం చాలామందికి సురక్షితమే అయినప్పటికీ, కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. పసుపును అతిగా వాడకూడదు. చిటికెడు లేదా అర టీస్పూన్ కంటే ఎక్కువ తీసుకోకపోవడం మంచిది. పాల ఉత్పత్తులు పడనివారు దీనికి దూరంగా ఉండాలి. వైద్యుల సలహా లేకుండా అధిక మోతాదులో కర్క్యుమిన్ సప్లిమెంట్లు వాడకూడదు.
రక్తం పలుచబడే మందులు (blood-thinning medication) వాడేవారు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వేసుకునేవారు పసుపును ఎక్కువ మోతాదులో తీసుకునే ముందు డాక్టర్ను సంప్రదించాలి. పసుపు పాలను కేవలం ఆరోగ్యకరమైన పానీయంగానే చూడాలి తప్ప, ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా వ్యాధికి పూర్తిస్థాయి చికిత్సగా భావించకూడదు.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
