Winter Migraine : చలికాలంలో మైగ్రేన్ కు ప్రధాన కారణం..ఈ అలవాట్లేనా..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చలికాలం మొదలైందంటే చాలు.. మైగ్రేన్ (migraine) బాధితులకు కష్టాలు రెట్టింపవుతాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడం, వాతావరణ పీడనంలో హెచ్చుతగ్గులు, ఎండ తక్కువగా ఉండటం వంటివి ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అయితే, మైగ్రేన్ పెరగడానికి కేవలం చలి మాత్రమే కారణం కాదు; ఈ సీజన్‌లో మన రోజువారీ అలవాట్లలో వచ్చే మార్పులే ప్రధాన విలన్‌గా మారుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

ఈ సీజన్‌లో ఎందుకు ఎక్కువవుతుంది..?

చలికాలంలో వాతావరణంలోని తేమ, ఉష్ణోగ్రతల మార్పులతో పాటు ఇళ్లలో పొడి గాలి పెరుగుతుంది. దీనికి తోడు నిద్ర వేళలు మారడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటివి మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి.

లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

తలలో ఒకవైపు మాత్రమే కొట్టుకున్నట్లుగా తీవ్రమైన నొప్పి రావడం, వికారం, వాంతులు, వెలుతురును చూడలేకపోవడం దీని ప్రధాన లక్షణాలు. కొందరిలో మైగ్రేన్ రావడానికి ముందు కంటి చూపు మసకబారడం లేదా మెరుపులు కనిపించడం జరుగుతుంది.

బయటపడటానికి ఈ జాగ్రత్తలు మేలు..!

మైగ్రేన్‌ను ప్రేరేపించే అంశాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. కాబట్టి సరైన జీవనశైలిని పాటించడం ద్వారా దీని తీవ్రతను తగ్గించుకోవచ్చు.ఏ ఆహారం తిన్నప్పుడు, లేదా ఎక్కువ సమయం స్క్రీన్ చూసినప్పుడు తలనొప్పి వస్తుందో గమనించి వాటికి దూరంగా ఉండాలి. ఇందుకోసం ఒక 'మైగ్రేన్ డైరీ'ని నిర్వహించడం మంచిది. రోజూ ఒకే సమయానికి నిద్రపోయి, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. సమయానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం మానేయకూడదు. చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది. అయినప్పటికీ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజంతా తగినంత నీరు తాగాలి.

 రోజూ కొంత సమయం వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి ఎంతో మేలు చేస్తాయి. చలిగా ఉందని పదేపదే టీ, కాఫీలు తాగడం తగ్గించాలి. కెఫీన్ ఎక్కువైతే మైగ్రేన్ మరింత పెరిగే ప్రమాదం ఉంది.

నిర్ధారణ, చికిత్స ఇలా..

మైగ్రేన్ సమస్యను వైద్యులు రోగి ఆరోగ్య చరిత్ర (medical history), లక్షణాల ఆధారంగా నిర్ధారిస్తారు. నొప్పి ఎంత తరచుగా వస్తోంది, ఎంత తీవ్రంగా ఉంటోంది అనే వివరాలతో పాటు శారీరక, నాడీ సంబంధిత పరీక్షలు చేస్తారు. అవసరమైతే ఎంఆర్ఐ (MRI) లేదా సీటీ స్కాన్ సూచిస్తారు.

చికిత్స అనేది నొప్పి తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా నొప్పిని, వికారాన్ని తగ్గించే మందులతో పాటు, మైగ్రేన్ రాకుండా నివారించే ఔషధాలను వైద్యులు ఇస్తారు. దీర్ఘకాలిక మైగ్రేన్‌తో బాధపడుతూ, సాధారణ మందులకు తగ్గని వారికి కొన్నిసార్లు 'సర్జికల్ మైగ్రేన్ డికంప్రెషన్' అనే ప్రక్రియను సూచిస్తారు. ఇందులో నొప్పిని ప్రేరేపించే నరాలపై ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఉపశమనం కలిగిస్తారు.

 

ఇది కూడా చదవండి..: Stronger Immunity : చలికాలంలో ఈ 'సూపర్‌ ఫుడ్స్' తీసుకుంటే.. మీ ఆరోగ్యానికి తిరుగుండదు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..Tea Side effect : పరకడుపున టీ తాగితే జుట్టు ఎందుకు రాలుతుంది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.