videos
Pranayama : రోజూ ప్రాణాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఎలా పెరుగుతుంది..?
సాక్షి లైఫ్ : మొబైల్, కంప్యూటర్ ఎక్కువగా వాడటం వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని ప్రాణాయామంతో తగ్గించుకోవచ్చా? ప్రాణాయామంతో పాటు ధ్యానం చేస్తే మరిన్ని ప్రయోజనాలు ఉంటాయా? రోజువారీ జీవితంలో ప్రాణాయామాన్ని అలవాటుగా ఎలా మార్చుకోవాలి? అందరూ 10 నిమిషాల ప్రాణాయామం చేయవచ్చా? ప్రాణాయామం ప్రారంభించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖాళీ కడుపుతోనే చేయాలా.. భోజనం చేసిన వెంటనే చేయవచ్చా? ప్రాణాయామం చేస్తున్నప్పుడు కళ్లు తిరిగితే ఏం చేయాలి? ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవాలా? మందులు లేకుండా స్ట్రెస్‌ను నియంత్రించ డంలో ప్రాణాయామం ఎంతవరకు సహాయపడు తుంది? పదినిమిషాల ప్రాణాయామం చేస్తే స్ట్రెస్ నిజంగా తగ్గుతుందా? స్ట్రెస్ సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడాన్ని ప్రాణాయామం నియంత్రించ గలదా? ప్రాణాయామం వల్ల మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతాయి? ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవ డానికి ఏ ప్రాణాయామం చేయాలి? టెన్షన్‌లో ఉన్నప్పుడు వెంటనే రిలాక్స్ అవ్వడానికి ఏ శ్వాస పద్ధతి ఉపయోగపడుతుంది? నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుంది? శ్వాసను ఎంతసేపు లోపలికి తీసుకుని, ఎంతసేపు బయటికి వదలాలి? ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్వాసను ఎక్కువసేపు బిగపట్టడం సురక్షితమేనా? రోజుకు 10 నిమిషాల ప్రాణాయామం మానసిక ఆరోగ్యానికి సరిపోతుందా? ప్రాణాయామం ఫలితాలు కనిపించాలంటే ఎన్ని రోజులు క్రమం తప్పకుండా చేయాలి? ఉదయం చేయడమా.. రాత్రి చేయడమా.. ఏ సమయం మంచిది? నిద్రకు ముందు ప్రాణాయామం చేస్తే నిద్ర నాణ్యత మెరుగుపడుతుందా? ప్రాణాయామం వల్ల ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరుగుతాయా? ఆఫీసు ఒత్తిడి, కుటుంబ సమస్యలు, పరీక్షల టెన్షన్ వంటి పరిస్థితుల్లో ప్రాణాయామం ఎంతవరకు సహాయపడుతుంది? కోపం, చిరాకు, నెగెటివ్ ఆలోచనలను తగ్గించుకోవడానికి ప్రాణాయామం ఉపయోగపడుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ యోగా నిపుణులు అరుణాదేవి సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
