videos
Jaundice Vs Pancreatic Cancer : జాండిస్, పాంక్రియాటిక్ క్యాన్సర్ మధ్య ఉన్న ప్రధాన సంబంధం ఏమిటి..?
సాక్షి లైఫ్ : 50 ఏళ్లు దాటిన వారిలో అకస్మాత్తుగా మధుమేహం (diabetes) రావడం లేదా ఉన్న షుగర్ అదుపు తప్పడం పాంక్రియాటిక్ క్యాన్సర్‌కు సంకేతమా? తరచూ వికారం, వాంతులు, అజీర్తి, తీవ్రమైన అలసట కనిపిస్తే క్లోమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలా? కామెర్లు వచ్చినంత మాత్రాన అది కచ్చితంగా క్లోమ క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం ఉందా? గాల్ స్టోన్స్, హెపటైటిస్ వల్ల వచ్చే కామెర్ల నుంచి క్యాన్సర్ కామెర్లను వైద్యులు ఎలా వేరు చేస్తారు? క్లోమ క్యాన్సర్ నిర్ధారణ కోసం లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT), సీఏ 19-9 (CA 19-9) రక్త పరీక్షలు ఎంతవరకు సహాయపడతాయి? సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ (EUS) వంటి పరీక్షల్లో ఏది క్లోమ కణితులను కచ్చితంగా గుర్తిస్తుంది? క్లోమ క్యాన్సర్ ఉన్నవారిలో కామెర్లు ఎందుకు తలెత్తుతాయి..? పాంక్రియాస్(pancreas) తల భాగంలో కణితి ఏర్పడినప్పుడు పిత్త నాళం (బైల్ డక్ట్) ఎలా మూసుకుపోతుంది? రక్తంలో బిలిరుబిన్ స్థాయిలు పెరగడానికి, క్లోమ క్యాన్సర్‌కు ఉన్న లింక్ ఏమిటి? క్లోమ క్యాన్సర్ ఉన్న ప్రతి ఒక్కరిలోనూ కామెర్లు తప్పనిసరిగా కనిపిస్తాయా? క్లోమంలోని ఏ భాగంలో క్యాన్సర్ వస్తే కామెర్లు త్వరగా బయటపడే అవకాశం ఉంటుంది? సాధారణ కామెర్లకు, క్లోమ క్యాన్సర్ వల్ల వచ్చే ‘అబ్స్ట్రక్టివ్ జాండిస్’కు మధ్య తేడా ఏమిటి? క్లోమ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడంలో కామెర్లు ఒక హెచ్చరిక సంకేతంగా ఎలా ఉపయోగపడతాయి? క్లోమ క్యాన్సర్ వల్ల వచ్చే కామెర్లలో కడుపు నొప్పి లేకపోవడం ఎందుకు ప్రమాదకర సంకేతం? కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడంతో పాటు శరీరమంతా తీవ్రమైన దురద రావడానికి కారణం ఏమిటి? మూత్రం ముదురు రంగులో రావడం క్లోమ క్యాన్సర్ లక్షణం కావచ్చా? మలం లేత రంగులో లేదా జిడ్డుగా, నీటిపై తేలేలా ఉండటం ఏ సమస్యను సూచిస్తుంది? ఎలాంటి ప్రయత్నం చేయకుండానే అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం ఈ క్యాన్సర్ తొలి సంకేతాలా? పై పొత్తికడుపులో మొదలై వీపు భాగానికి పాకే నొప్పిని క్లోమ క్యాన్సర్ లక్షణంగా ఎప్పుడు అనుమానించాలి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
