videos
Diabetes Reverse : డయాబెటిస్ ఒక్కసారి వస్తే జీవితాంతం ఉంటుందా లేదా రివర్స్ చేయవచ్చా..?
సాక్షి లైఫ్ : డయాబెటిస్ బాధితులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పాలు, టీ తాగవచ్చా? షుగర్ పేషెంట్లు రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చు,మాంసాహారం తీసుకోవచ్చా? పంచదారకు బదులుగా బెల్లం, తేనె లేదా ఆర్టిఫిషియల్ స్వీటెనర్లను వాడవచ్చా? ఏ కూరగాయలు షుగర్‌ను అదుపులో ఉంచుతాయి..? దుంప కూరలు ఎందుకు తినకూడదు? భోజనం చేసిన వెంటనే షుగర్ లెవెల్స్ పెరగకుండా (Blood Sugar Spike) ఎలా నివారించాలి? రోజుకు ఎంతసేపు నడవాలి (Walking)ఏ వ్యాయామాలు షుగర్ పేషెంట్లకు ఉత్తమం? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం మధుమేహ బాధితులకు సురక్షితమేనా? షుగర్ టాబ్లెట్లను భోజనానికి ముందు వేసుకోవాలా లేక తర్వాత వేసుకోవాలా? రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పడిపోతే (Hypoglycemia) వెంటనే ఏమి చేయాలి? డయాబెటిస్ వల్ల వచ్చే నీరసం, అలసట, కాళ్ల మంటలు, నరాల బలహీనత తగ్గడానికి ఏమి తినాలి? మధుమేహం అదుపులో లేకపోతే కిడ్నీలు, కళ్లు, గుండెపై ఎటువంటి ప్రభావం పడుతుంది? సాధారణ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి..?HbA1c టెస్ట్ ప్రాముఖ్యత ఏమిటి? మందులు లేకుండా కేవలం ఆహార నియమాలు, వ్యాయామంతో షుగర్‌ను కంట్రోల్ చేయవచ్చా? షుగర్ పేషెంట్లు ఉదయం అల్పాహారం (Breakfast) లో ఏమి తినాలి? మధుమేహం ఉన్నవారు రాత్రిపూట భోజనంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి? తెల్ల అన్నం పూర్తిగా మానేయాలా లేక ఏ పద్ధతిలో వండుకుని తింటే షుగర్ పెరగదు? చద్దన్నం లేదా సద్ది అన్నం తినడం వల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుందా? షుగర్ ఉన్నవారు ఏ పండ్లు తినవచ్చు, సీతాఫలం, మామిడి వంటి ఏ పండ్లకు దూరంగా ఉండాలి? కాకరకాయ రసం, మెంతి గింజల నీరు తాగితే షుగర్ త్వరగా తగ్గుతుందా? రాగి జావ, జొన్న రొట్టెలు వంటి చిరుధాన్యాలు షుగర్‌ను తగ్గిస్తాయా..? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణుల సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
