videos
Hypothyroidism : ఉప్పులో అయోడిన్ లోపిస్తే హైపోథైరాయిడిజం ముప్పు పెరుగుతుందా..?
సాక్షి లైఫ్ : ఉప్పు నిల్వ చేసే డబ్బాలను గాలి, తేమ, ఎండ తగలకుండా భద్రపరచడం ద్వారా అయోడిన్ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చా? వంట ముగింపు దశలో ఉప్పు కలపడం వల్ల అందులోని అయోడిన్ నాణ్యత చెడిపోకుండా ఉంటుందా? కేవలం ఉప్పుపైనే ఆధారపడకుండా పాలు, గుడ్లు, సముద్రపు చేపల ద్వారా అయోడిన్ సమకూర్చుకోవడం మంచిదేనా? క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోయా వంటి గోయిట్రోజెనిక్ ఆహారాలను గర్భిణులు పూర్తిగా దూరం పెట్టాలా లేక వండుకుని తినవచ్చా? బయటి ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉండే ఉప్పు థైరాయిడ్‌ను ఎలా దెబ్బతీస్తుంది? కుటుంబ చరిత్రలో థైరాయిడ్ సమస్యలు ఉంటే ఆహారంలో ఎలాంటి ముందస్తు మార్పులు చేసుకోవాలి? తల్లిపాల ద్వారా బిడ్డకు తగినంత అయోడిన్ అందాలంటే బాలింతగా మారిన తర్వాత ఉప్పు, ఆహార నియమాలు ఎలా ఉండాలి? గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడానికి గైనకాలజిస్ట్‌తో పాటు ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించడం ఎప్పుడు అవసరం? గర్భధారణ సమయంలో ఉప్పు వాడకం థైరాయిడ్ పనితీరును ఎలా ప్రభావితం చేస్తుంది? అయోడైజ్డ్ ఉప్పు గర్భిణులకు ఎందుకు అత్యంత ఆవశ్యకం? రోజువారీ ఆహారంలో గర్భిణులు ఎంత మోతాదులో అయోడిన్ తీసుకోవాలి? సాధారణ కల్లుప్పు కంటే అయోడైజ్డ్ ఉప్పు వాడటమే శ్రేయస్కరమా? అవసరానికి మించి ఉప్పు తీసుకుంటే థైరాయిడ్ గ్రంథిపై ప్రతికూల ప్రభావం పడుతుందా? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
