videos
Probiotics and Prebiotics : ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ ఏయే ఆహారాల్లో ఎక్కువగా దొరుకుతాయి..?
సాక్షి లైఫ్ : తగినన్ని నీళ్లు తాగకపోవడం వల్ల మన జీర్ణవ్యవస్థపై, చర్మంపై ఎలాంటి తీవ్రమైన ప్రభావం పడుతుంది? యాంటీబయా టిక్స్ వాడినప్పుడు చనిపోయే మంచి బ్యాక్టీరియాను ఆహారం ద్వారా మళ్లీ ఎలా బతికించుకోవాలి? మన దైనందిన జీవనశైలి, మానసిక ఒత్తిడి (Stress) మన జీర్ణవ్యవస్థను ఎంత ఘోరంగా దెబ్బతీస్తాయో మీరు ఎప్పుడైనా గమనించారా? 'గట్-బ్రెయిన్ యాక్సిస్' (Gut-Brain Axis) ద్వారా మన మెదడులోని ఆలోచనలు, మన పొట్ట ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? రాత్రిపూట సరైన నిద్ర లేకపోవడం వల్ల పేగుల ఆరోగ్యం పాడై, మనం ఎందుకు త్వరగా ముసలివారిలా కనిపిస్తాము? మన శరీర రోగనిరోధక శక్తిలో 70 శాతానికి పైగా మన పేగుల్లోనే ఉంటుందన్న విషయం మీకు తెలుసా? తరచుగా గ్యాస్, అసిడిటీ, బ్లోటింగ్ లాంటి సమస్యలు రావడం మన వయసు వేగంగా పెరుగుతుందనడానికి సంకేతమా? మన జీర్ణవ్యవస్థ దెబ్బతింటే మన చర్మం ఎందుకు త్వరగా వృద్ధాప్య ఛాయలను సంతరించు కుంటుంది? గట్ హెల్త్ పాడైనప్పుడు శరీరంలో చర్మాన్ని యవ్వనంగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తి ఎందుకు తగ్గిపోతుంది? పేగుల ఆరోగ్యం క్షీణిస్తే మన ముఖంపై ముడతలు ఎందుకు త్వరగా వస్తాయి? 'గట్-స్కిన్ యాక్సిస్' (Gut-Skin Axis) అనే ఈ అద్భుతమైన ప్రక్రియ మన చర్మ కాంతిని ఎలా నియంత్రిస్తుంది? మన పొట్టలో ఉండే కోటానుకోట్ల మంచి బ్యాక్టీరియా (Gut Microbiome) మనల్ని యవ్వనంగా ఉంచడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అంటే ఏమిటి, ఇవి ఏయే ఆహారాల్లో ఎక్కువగా దొరుకుతాయి? పెరుగు, మజ్జిగ, ఇడ్లీ లాంటి పులియబెట్టిన ఆహారాలు మన గట్ బ్యాక్టీరియాను ఎలా సంరక్షిస్తాయి? పీచు పదార్థం (ఫైబర్) తక్కువగా తినడం వల్ల పేగుల ఆరోగ్యం ఎంతలా ప్రమాదంలో పడుతుంది? మనం రోజూ తినే పంచదార, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ మన పొట్టలోని మంచి బ్యాక్టీరియాను ఎలా నాశనం చేస్తున్నాయి? అనే అంశాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు సాక్షి లైఫ్ కు వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.. గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
