న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే
సాక్షి లైఫ్ : న్యూరాలజీ విభాగాల్లోని సర్జన్లు కూడా వెన్నెముక రుగ్మతలను పరిష్కరించడానికి అవసరమైన శస్త్రచికిత్స చేసేందుకు అర్హులని నేషనల్ మెడికల్ కమిషన్ వెల్లడించింది. దీర్ఘకాలంగా ఉన్న సందేహాలను నివృత్తి చేయడం ద్వారా శాస్త్రీయ స్థితిని అవలంభించాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి.. హిమోఫిలియాకు ప్రధాన కారణాలు తెలుసా..?
వెన్నెముక వైకల్యం, వ్యాధి, ప్రమాదాలు వంటి సమస్యలకు వెన్నెముక శస్త్రచికిత్స అవసరమవుతుంది. అటువంటి శస్త్రచికిత్సలు చేయడానికి ఎవరు అర్హులు అనే విషయంలో అనేక చర్చలు, వివాదాలు జరిగాయి. గత ఏడాది నవంబర్‌లో నేషనల్ మెడికల్ కమిషన్ ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు ఈ అంశంపై చర్చించింది. చర్చల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి.. వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి.. నల్ల ఉప్పుతో ఆరోగ్య ప్రయోజనాలివే
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
