Corona Cases Rise Again in Mumbai : ముంబైలో మళ్లీ కరోనా కలకలం.. వాతావరణ మార్పులతో పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ‘కరోనా మహమ్మారి పూర్తిగా అంతమైపోయింది.. ఇక భయం లేదు’ అనుకుంటున్న తరుణంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ కోవిడ్ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. గత కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రముఖ ప్రయోగశాలలు, ఆసుపత్రులకు వస్తున్న రోగుల్లో కోవిడ్-19తో పాటు హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ) పాజిటివ్ కేసులు నమోదవుతున్నట్లు వైద్య నివేదికలు వెల్లడిస్తున్నాయి.

మరోవైపు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో స్వైన్ ఫ్లూ కారణంగా ఒకరు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్, స్వైన్ ఫ్లూతో పాటు ఇన్‌ఫ్లుయెంజా ఏ, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ (RSV) వంటి శ్వాసకోశ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 

రూపాంతరం చెందుతున్న వైరస్..!

కరోనా అనేది నిరంతరం రూపాంతరం చెందే ఒక ఆర్ఎన్ఏ (RNA) వైరస్. తన మనుగడను సాగించడం కోసం ఇది నిరంతరం కొత్త వేరియంట్లుగా మారుతూనే ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ముంబైలో వ్యాపిస్తున్న వేరియంట్ ఏది..? బాధితుల్లో ఎలాంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి? అనే అంశాలపై స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ కేసుల పట్ల తీవ్రమైన ఆందోళన అవసరం లేదని, అయితే వైరస్ అనుకూల పరిస్థితులు దొరికినప్పుడు మళ్లీ క్రియాశీలకమయ్యే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తప్పనిసరని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ముంచుకొస్తున్న సీజనల్ వ్యాధులు.. ఎందుకీ పెరుగుదల..?

ప్రస్తుతం ముంబైతో పాటు దేశంలోని పలు నగరాల్లో ఆసుపత్రుల నిండిపోతున్నాయి. అధిక జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలతో ఒపిడి (OPD) కి వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

వాతావరణ మార్పులే కారణమా..?

ఎపిడెమియాలజిస్టుల విశ్లేషణ ప్రకారం.. రుతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల వాతావరణంలో తేమ శాతం (humidity) విపరీతంగా పెరిగింది. గాలిలో కదలికలు లేకపోవడం వల్ల ఈ శ్వాసకోశ వైరస్‌లు సాధారణం కంటే ఎక్కువ సమయం గాలిలోనే నిలిచి ఉండి, ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తున్నాయి.

 అన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి..

శ్వాసకోశానికి సంబంధించిన అన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల లక్షణాలు (కోవిడ్, స్వైన్ ఫ్లూ, ఆర్‌ఎస్‌వి) దాదాపు ఒకేలా ఉంటాయి. అందువల్ల కేవలం లక్షణాలను చూసి ఏ వైరస్ సోకిందో గుర్తించడం సాధ్యం కాదు. రోగికి ఖచ్చితమైన చికిత్స అందించాలంటే పీసీఆర్ (PCR) ల్యాబ్ పరీక్షలు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. మారిన వాతావరణంలో జ్వరం, దగ్గు వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు.. 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.